Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravibabu: చంద్రబాబు కష్టాలన్నీ త్వరలో తొలగిపోతాయి.. టీడీపీ అధినేత అరెస్టుపై నటుడు రవిబాబు రియాక్షన్‌

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్‌, నటుడు రవిబాబు స్పందించారు. చంద్రబాబుకు వచ్చిన కష్టాలు త్వరలోనే తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.' జీవితంలో ఏవీ శాశ్వతం కావు. సినిమా వాళ్ల గ్లామర్‌ కానీ రాజకీయ నాయకుల పవర్‌ కానీ అసలు శాశ్వతం కాదు. అలాగే చంద్రబాబు నాయుడుకు వచ్చిన కష్టాలు కూడా శాశ్వతం కావు. త్వరలోనే త్వరలోనే అవన్నీ తొలిగిపోతాయి.

Ravibabu: చంద్రబాబు కష్టాలన్నీ త్వరలో తొలగిపోతాయి.. టీడీపీ అధినేత అరెస్టుపై నటుడు రవిబాబు రియాక్షన్‌
Ravibabu, Chandrababu
Follow us
Basha Shek

|

Updated on: Sep 30, 2023 | 9:46 AM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్‌, నటుడు రవిబాబు స్పందించారు. చంద్రబాబుకు వచ్చిన కష్టాలు త్వరలోనే తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.’ జీవితంలో ఏవీ శాశ్వతం కావు. సినిమా వాళ్ల గ్లామర్‌ కానీ రాజకీయ నాయకుల పవర్‌ కానీ అసలు శాశ్వతం కాదు. అలాగే చంద్రబాబు నాయుడుకు వచ్చిన కష్టాలు కూడా శాశ్వతం కావు. త్వరలోనే త్వరలోనే అవన్నీ తొలిగిపోతాయి. రామారావు ఫ్యామిలీ, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు మా ఫ్యామిలీకి మంచి ఆప్తులు. చంద్రబాబు గురించి చెప్పాలంటే ఆయన ఏదైనా పనిచేసే ముందు వంద యాంగిల్స్ లో చూసి, అందరినీ సంప్రదించి ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా నిర్ణయం తీసుకుంటారు. భూమ్మీద ఈ రోజే లాస్ట్ డే అని తెలిసినా కూడా.. కూర్చొని తర్వాతి యాభై సంవత్సరాలకు సోషల్ డెవలప్ మెంట్ గురించి ప్లాన్ చేస్తారు. ఆయన డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి కాదు. ప్రతి క్షణం ప్రజల కోసమే ఆలోచిస్తారు. అలాంటి మనిషిని ఎటువంటి ఆధారం లేకుండా, అక్రమ కేసులు బనాయించి, జైల్లో పెట్టి ఎందుకు హింసిస్తున్నారో అర్ధం కావటం లేదు. రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు చాలా సహజం. కానీ 73ఏళ్ల ఆయనను జైల్లో పెట్టి హింసించడం ఏ ఎత్తో పై ఎత్తో అయితే మాత్రం అది చాలా దారుణం’

‘ అశాశ్వతమైన పవర్ ను ఉన్న వాళ్లకు నా హంబుల్ రిక్వెస్ట్. మీరు ఏ పవర్ నైతే వాడి చంద్రబాబును జైల్లో పెట్టారో.. దయచేసి అదే పవర్ ఉపయోగించి ఆయనను వదిలేయమని ప్రాధేయపడుతున్నాడు. మీరు చిటికేస్తే జరిగిపోతుందని అందరికీ తెలుసు. ఆయనను జైలు నుంచి కాకుండా బయట ఉంచి మీ ఇష్టం వచ్చినట్లు ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. ఆయనైతే దేశాన్ని వదిలి పారిపోరుగా. ఆలోచించండి. చరిత్ర మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలనుకుంటున్నారు. కక్షతో రగిలిపోయే కసాయి వాళ్లలాగానా? లేకపోతే జాలి మనసు, దయ, మోరల్స్‌ ఉన్నా నాయకుల్లాగానా? మీరే ఆలోచించుకోండి. దయచేసి చంద్రబాబును వదిలేయండి. నాలాగా ఎంతోమంది మీ పట్ల ఎంతో కృతజ్ఞతతో ఉంటారు. నమస్తే’ అని చెప్పుకొచ్చారు రవిబాబు. ప్రస్తుతం అతని వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

వారు చిటికెస్తే చంద్రబాబు బయటకు వస్తారు..

రవిబాబు లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..