Actor Prudhvi : అందరికీ క్షమాపణలు చెబుతున్నా.. నావల్ల సినిమాకు నష్టం జరగకూడదు.. నటుడు పృథ్వీ..

లైలా సినిమా ఈవెంట్లో నటుడు పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఆ సినిమాను బహిష్కరించాలని నెట్టింట హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. ఈ వివాదం పై ఇప్పటికే హీరో విశ్వక్ సేన్ సారీ చెప్పగా.. తాజాగా నటుడు పృథ్వీ రాజ్ సైతం క్షమాపణలు చెప్పారు.

Actor Prudhvi : అందరికీ క్షమాపణలు చెబుతున్నా.. నావల్ల సినిమాకు నష్టం జరగకూడదు.. నటుడు పృథ్వీ..
Prudhvi

Updated on: Feb 13, 2025 | 8:55 PM

వేధించినవారిని వదిలే ప్రసక్తేలేదు… ఎంతదూరమైనా వెళ్తా…! ఒకొక్కరిపై కోటి రూపాయల పరువు నష్టం దావా వేస్తానన్న నటుడు పృథ్వీ దిగొచ్చారు. ఐయామ్‌ వెరీ సారీ అంటున్నారు. ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే మనస్ఫూర్తిగా క్షమించండి అంటూ వీడియో విడుదల చేశారు పృథ్వీ. కాపాడండయ్యా నన్నూ అంటూ నిన్న సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన నటుడు పృథ్వీ… ఇవాళ క్షమించండయ్యా అంటున్నారు. లైలా సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానన్నారు. అసలేం జరిగింది…?

ఇక మొన్న లైలా సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో పృథ్వీ చేసిన కామెంట్స్‌ తీవ్ర దుమారం రేపాయి. షూటింగ్ స్పాట్‌లో జరిగిన ఓ సంభాషణను వివరిస్తూ… 150 మేకలు 11 అయ్యాయన్న ఆయన కామెంట్స్ వైరల్‌గా మారాయి. దీంతో పృథ్వీకి వేధింపులు ఎక్కువయ్యాయి. వేల సంఖ్యలో ఫోన్‌కాల్స్‌, వందలకొద్దీ మెసేజ్‌లతో టార్చర్‌ చేస్తున్నారంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు పృథ్వీ. వెనక్కి తగ్గేదేలే లేదు.. తనను వేధించినవారికి శిక్షపడేందుకు ఎంతదూరమైనా వెళ్తానన్నారు. కానీ ఇప్పుడు సినిమా కోసం దిగొచ్చానంటున్నారు పృథ్వీ. తనవల్ల సినిమాకు ఎలాంటి నష్టం జరగకూడదని సారీ చెబుతున్నట్లు తెలిపారు.

ఎండ్- మొత్తంగా… పృథ్వీ దిగొచ్చారు…! మరి ఆయనన్ను వేధించినవాళ్లు సారీతో కూల్‌ అవుతారా…? ఇష్యూ ఇంతటితో ఆగినట్లేనా…! చూడాలి ఏం జరుగుతుందో…!

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన