Noel Sean: అమ్మ చేతుల మీదుగా.. కొత్త కారు కొన్న టాలీవుడ్ నటుడు.. ధర ఎన్ని లక్షలంటే?

ఆర్జే, సింగర్, మ్యూజిక్ కంపోజర్, రైటర్, యాక్టర్.. ఇలా టాలీవుడ్ లో ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్లలో నోయెల్ సీన్ కూడా ఒకరు. అయితే ఇప్పటివరకు అతని ట్యాలెంట్ కు తగ్గ గుర్తింపు రాలేదనే చెప్పుకోవచ్చు. తాజాగా ఈ నటుడు ఖరీదైన కొత్త కారు కొన్నాడు..

Noel Sean: అమ్మ చేతుల మీదుగా.. కొత్త కారు కొన్న టాలీవుడ్ నటుడు.. ధర ఎన్ని లక్షలంటే?
Noel Sean

Updated on: Aug 23, 2025 | 8:09 PM

హైదరాబాద్ కు చెందిన నోయెల్ సీన్ 2006లో ‘సంభవామి యుగేయుగే’ అనే సినిమాతో కెరీర్ ఆరంభించాడు. ఆ తర్వాత మంత్ర, మగధీర, ఈగ తదితర చిత్రాల్లో నటించాడు. సహాయక నటుడి పాత్రలతో పాటు విలన్ రోల్స్ తోనూ మెప్పించాడు. ముఖ్యంగా రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘కుమారి 21 ఎఫ్’ మూవీలో నోయెల్ విలనిజం బాగా పండింది. ఈ మూవీ అతనికి మంచి గుర్తింపుతో పాటు అవకాశాలను తెచ్చిపెట్టింది. నాన్నకు ప్రేమతో, ప్రేమమ్, నాన్నా నేను నా బాయ్ ఫ్రెండ్స్, రంగ స్థలం, హలో గురూ ప్రేమ కోసమే, పడి పడి లేచే మనసు, వలయం, రంగబలి, పొట్టేల్ తదితర సినిమాల్లో నటించాడు నోయెల్. అలాగే బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్‌లోనూ పాల్గొన్నాడు. అయితే ఆరోగ్య కారణాల రీత్యా షో నుంచి మధ్యలోనే బయటకొచ్చేశాడు. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉంటోన్న నోయెల్ ఒక ఖరీదైన కొత్త కారు కొనేశాడు. అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందులో నోయెల్ తల్లిని కూడా చూడవచ్చు. ఆమె చేతుల మీదుగానే నోయెల్ కారును కొనుగోలు చేయడం విశేషం.

ఇక నోయెల్ కొన్న కారు విషయానికి వస్తే.. మహీంద్ర కంపెనీకి చెందిన బీఈ6 మోడల్ ఎలక్ట్రిక్ కారు ధర భారీగానే ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్ లో ఈ మోడల్ కారు ధర సుమారు రూ.20 లక్షల వరకు ఉంది. నోయల్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నటుడికి అభినందనలు, శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

కొత్త కారులో నటుడు నోయెల్ కుటుంబ సభ్యులు..

నోయెల్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఈ నటుడు 2019లో హీరోయిన్ ఎస్తర్ నోరాన్హాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఏడాదిలోనే వీరు విడాకులు తీసుకుని విడిపోయింది. ఎస్తర్ కూడా ఇప్పుడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది.

కుమారి 21F టీమ్ తో..

ఈవెంట్ లో నోయెల్ డ్యాన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.