ఆ హీరో పవర్ ఫుల్ కళ్ళను చూసి డైలాగ్ మర్చిపోయా.. దెబ్బకు వణుకొచ్చింది
సినిమా ఇండస్ట్రీలో విలన్ గా మెప్పించిన వారు చాలా మంది ఉన్నారు వారిలో నాగ మహేష్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అనేక పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు నాగ మహేష్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగ మహేష్ ఓ స్టార్ హీరో గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నటుడు నాగ మహేష్ ఇలా చెప్తే చాలా తక్కువమంది మాత్రమే గుర్తుపడతారు.. కానీ ఆయనను చూస్తే ఓహో ఈయనా అని టక్కున ఆయన చేసిన పాత్రలను గుర్తు తెచ్చుకుంటారు. ఎన్నో సినిమాల్లో విలన్ గా, సహాయక పాత్రల్లో నటించి మెప్పించారు నాగ మహేష్. చేసిన సినిమాలన్నింటిలో ఎక్కువగా విలన్ పాత్రలే చేశారు నాగ మహేష్. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఖైదీ నంబర్ 150 చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేసిన తన అనుభవాలను పంచుకున్నారు. తన సెకండ్ ఇన్నింగ్స్ లో చిరంజీవి గారి పుణ్యమా అని ఖైదీ నంబర్ 150 లో వేషం దక్కిందని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ చిత్రంలో నాగ మహేష్ చిరంజీవి షర్టు పట్టుకుని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే ఒక బ్యాడ్ ఇన్‌స్పెక్టర్ పాత్రను పోషించారు. స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే వణుకు వచ్చిందని, షూటింగ్ రోజున చిరంజీవి గారికి నమస్కరించి, ఈ సన్నివేశంలో కొంచెం రఫ్‌గా ప్రవర్తించాల్సి ఉంటుందని, దయచేసి తనను ఆశీర్వదించమని అడిగారట నాగ మహేష్. అప్పుడు చిరంజీవి మహేష్ నెత్తి మీద చెయ్యి పెట్టి, “మహేష్, చాలా మంచి వేషం, జాగ్రత్తగా చేయి, నువ్వు చేసేస్తావ్” అని దీవించారని మహేష్ తెలిపారు.
ఇది కూడా చదవండి :చిన్నప్పుడు తెగ అల్లరి చేసేవాడు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. గర్వంగా ఉందన్న రోజా
సహజంగా తనకు భయం లేదని, చిరంజీవితో పరిచయం ఉండటంతో మొదటి నుంచీ టెన్షన్ లేకుండా సన్నివేశాలు చేశానని మహేష్ చెప్పారు. అయితే, ఒక సందర్భంలో చిరంజీవి చెల్లి గురించి తాను రూడ్‌గా మాట్లాడగా, చిరంజీవికి కోపం వచ్చి తన షర్టు లాగి ఇద్దరూ ముఖాముఖి ఎదురుపడాలి.. ఆ క్షణంలో చిరంజీవి పవర్ ఫుల్ కళ్ళను చూసి మహేష్ తన డైలాగులు పూర్తిగా మర్చిపోయారట. “నా కొడకా” అనే ఎమోషన్ తో కూడిన డైలాగ్ చెప్పలేకపోయా.. దీంతో ఆ సన్నివేశానికి నాలుగైదు టేకులు పడ్డాయి. సుమారు 500 మంది జూనియర్ ఆర్టిస్టులు చుట్టూ ఉన్నప్పటికీ, తాను డైలాగ్ చెప్పలేకపోతున్నానని సిగ్గుతో కుంగిపోయానని మహేష్ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: ఆ స్టార్ హీరో హలీం వండితే పండగే.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే
ఆ సమయంలో దర్శకుడు వి.వి. వినాయక్ దేవుడిలా వచ్చి, మహేష్ ఎందుకు డైలాగ్ చెప్పలేకపోతున్నారని తెలుసుకున్నారు. “ఆయన సూటిగా మీ కళ్ళల్లో చూసి డైలాగ్ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, ఆ కళ్ళు చూసి ఆయన చెప్పలేకపోతున్నాడు” అని వినాయక్ తన బలహీనతను పసిగట్టి చిరంజీవికి చెప్పారట. అప్పుడు చిరంజీవి ఒక చిన్న చిట్కా ఇచ్చారు. “మహేష్, కెమెరా ప్రొఫైల్‌లో ఉంది, నా కళ్ళలో చూడకు. ఈ ఏరియా చూడు. ఈ ఏరియా చూసినా నా కళ్ళు చూసినట్టే ఉంటుంది. ఇక్కడ చూసి డైలాగ్ చెప్పేసేయ్” అని సూచించారట. చిరంజీవి చెప్పినట్లుగా ఆయన నుదురు భాగం లేదా కెమెరా ప్రొఫైల్‌లో చూసి మహేష్ ఆ డైలాగ్‌ను విజయవంతంగా పూర్తి చేశారట. ఈ టెక్నిక్ ప్రేక్షకులకు తెలియదని, ఆ రోజున ఆ సలహా లేకపోతే ఇంకా ఎక్కువ టేకులు పడి ఉండేవి అని మహేష్ చెప్పుకోచ్చారు. తన జీవితంలో ఎక్కువ టేకులు పడింది ఆ సందర్భంలోనే అని, సాధారణంగా తనకు సెకండ్ టేక్ కూడా ఎక్కువగా అవసరం ఉండదని తెలిపారు. డైలాగ్ పేపర్‌ని టిఫిన్ కోసం ఎదురుచూసినంత ఆరాటంగా చూస్తానని, ప్రతి డైలాగ్ ను ఎలా చెప్పాలో ఎక్సర్సైజ్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు నాగ మహేష్.
ఇది కూడా చదవండి :అతను ఎంతో గొప్పనటుడు నటుడు.. ఆ హీరోకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది
View this post on Instagram




