చిన్నప్పుడు రస్నా యాడ్ లో నటించిన ఈ చిన్నారి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసా.?
చాలా మంది హీరోయిన్స్ రకరకాల యాడ్స్ లో నటించిన విషయం తెలిసిందే. చాలా మంది స్టార్ హీరోయిన్స్ యాడ్స్ ద్వారానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆతర్వాత హీరోయిన్స్ గా మారి సక్సెస్ అయ్యారు. అలాగే ఈ అమ్మడు కూడా కెరీర్ బిగినింగ్ లో ఈ బ్యూటీ రస్నా యాడ్ లో నటించింది. ఆమె ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్

చాలా మంది హీరోయిన్స్ కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసి ఆతర్వాత హీరోయిన్స్ గా మారి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అలాగే కొంతమంది యాడ్స్ లోనూ నటించి ఎం ఇప్పించారు. యాడ్స్ లో నటించిన చాలా మంది ఇప్పుడు హీరోయిన్స్ గా మారి హిట్స్ అందుకుంటున్నారు. కాగా చిన్నప్పుడు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న యాడ్స్ లో రస్నా యాడ్ ఒకటి. సమ్మర్ వచ్చిందంటే చాలు ఈ యాడ్ టీవీల్లో తెగ సందడి చేసేది. అయితే ఈ రస్నా యాడ్ లో నటించిన ఓ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ అని మీకు తెలుసా.? ఆమె నందమూరి హీరోలతో ఆడిపాడింది. అంతే కాదు తన అందచందాలతో కుర్రకారును కట్టిపడేసింది. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?
రస్నా యాడ్ లో క్యూట్ గా నటించిన ఈ చిన్నది ఎవరో కాదు. అంకిత.. ఈ పేరు చెప్తే పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు కానీ.. ఆమెను చూస్తే ఈమేనా అంటారు. సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించింది. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించారు. ఎన్టీఆర్ జోడిగా భూమిక, అంకితనటించారు. వీరిలో అంకిత తన అందాలతో ప్రేక్షకులను మెప్పించింది.
అంకిత చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది ఈ భామ, రస్నా యాడ్ లో నటించిన ఈ చిన్నది ఆతర్వాత రస్నా బేబీగా మారిపోయింది. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తర్వాత సింహాద్రి సినిమాలో చేసింది. విజయేంద్రవర్మ, సీతారాముడు,అనసూయ, వినాయకుడు సినిమాలు చేసింది. కానీ ఆతర్వాత ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది. ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉంది అని చాలా మంది గూగుల్ లో గాలిస్తున్నారు. అంకిత సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండదు ఆమెకు సంబందించిన లేటెస్ట్ ఫోటోలు కూడా గూగుల్ లో తక్కువే ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..