AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు తెలుగులో హ్యాండ్సమ్ హీరో.. ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ జ్యూయెలరీ మాల్ ఓనర్.. కోట్లలో ఆదాయం

హీరోల్లో చాలా మంది రకరకాల బిజినెస్ లు చేస్తూ చేజేతులా సంపాదిస్తున్నారు. రియల్ ఎస్టేట్, రెస్టారెంట్స్, ట్రావెల్స్, మల్టీప్లెక్స్.. ఇలా ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తున్నారు మన హీరోలు. అలా ఈ నటుడు కూడా బిజినెస్ లో తోపు అని చెప్పుకోవచ్చు.

Tollywood: ఒకప్పుడు తెలుగులో హ్యాండ్సమ్ హీరో.. ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ జ్యూయెలరీ మాల్ ఓనర్.. కోట్లలో ఆదాయం
Tollywood Actor
Basha Shek
|

Updated on: Jun 09, 2026 | 4:29 PM

Share

హీరోలు బిజినెస్ చేయడం కొత్త విషయమేమీ కాదు.. నాటి శోభన్ బాబు నుంచి నేటి మహేష్ బాబు దాకా ఎంతో మంది హీరోలు ఎన్నో రకాల బిజినెస్ లు చేస్తూ వస్తున్నారు. తమ తెలివితేటలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. రియల్ ఎస్టేట్, హోటల్స్, రెస్టారెంట్స్, ట్రావెల్స్, మల్టీప్లెక్స్.. ఇలా ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తున్నారు మన హీరోలు. అలా ఈ దక్షిణాది నటుడు కూడా బిజినెస్ లో టాప్ అని చెప్పుకోవచ్చు. గతంలో తెలుగు, తమిళ భాషల్లో హీరోగా చేసిన ఈ నటుడు ఇప్పుడు అడపాదడపా మాత్రమే సినిమాల్లో కనిపిస్తున్నాడు. హీరోలు, హీరోయిన్లకు సోదరుడి పాత్రలు వేస్తూ సహాయక నటుడిగా రాణిస్తున్నాడు. అయితే ఇలా సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ లో అదరగొడుతున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. అందుకే ఈ నటుడికి పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినా నెలకు కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నాడు. గతంలోకి వెళితే.. హీరోగా కెరీర్ ఫుల్ స్పీడ్ లో ఉన్నప్పుడే ఈ నటుడు చెన్నైలోని హాట్‌స్పాట్‌గా పేరుగాంచిన టి.నగర్‌లో ఒక స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఆ స్థలంలో 10 అంతస్తులతో దేశంలోనే అతి పెద్ద జ్యూయెలరీ మాల్ ను కట్టించాడు. అందులో చాలా ప్రముఖ నగల దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల అద్దెనే లక్షల్లో ఉంటుందట. అలా ఈ మాల్ ద్వారాన నటుడికి ప్రతి నెలా కోట్లాది రూపాయల ఆదాయం వస్తోంది.

అలా ఒకప్పుడు దక్షిణాదిలో హ్యాండ్సమ్ ఓ వెలుగు వెలిగి ఇప్పుడు బిజినెస్ లోనూ తోపు అనిపించుకుంటున్న ఆ నటుడు మరెవరో కాదు జీన్స్ ఫేమ్ ప్రశాంత్. కొన్నేళ్ల క్రితం చెన్నైలోని టి. నగర్ పానగల్ పార్క్ లో ప్రశాంత్ రియాల్ గోల్డ్ టవర్ పేరుతో ఓ జ్యూయెలరీ మాల్ ను కట్టించాడు ప్రశాంత్. దాదాపు 10 అంతస్తులతో 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మాల్ ఉంది. జోయలుక్కాస్, వైట్ ఫైర్ డైమండ్స్ వంటి ప్రముఖ నగల బ్రాండ్‌లకు ఇది నిలయం. అంతేకాదు ఫుడ్ కోర్ట్, ఏటీఎంలు, విశాలమైన పార్కింగ్ సౌకర్యం కూడా ఈ మాల్ లో ఉన్నాయి. ఈ దుకాణల అద్దెనే లక్షల్లో ఉంటుందని సమాచారం. ఈ బిల్డింగ్ లోనే ప్రశాంత్ ఆఫీస్ కూడా నడుస్తోంది. ప్రశాంత్ సోదరి, నగల డిజైనర్ ప్రీతి త్యాగరాజన్ ఈ మాల్ మేనేజ్మెంట్ బాధ్యతలను చూసుకుంటోంది. కాగా ప్రశాంత్ కు సుమారు రూ. 150 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు సమాచారం.

గోల్డ్ టవర్ ఉద్యోగులు, సిబ్బందితో ప్రశాంత్..

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికి వస్తే.. 2024లో అంధాదూన్ రీమేక్ లో హీరోగా చేశాడు ప్రశాంత్. అదే ఏడాది దళపతి విజయ్ నటించిన గోట్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు ప్రశాంత్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!
28 ఏళ్ల రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర సృష్టించిన జోడీ
28 ఏళ్ల రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర సృష్టించిన జోడీ