
2023లో సినీ లవర్స్ కు పండగే అని చెప్పాలి బడా బడా సినిమాలన్నీ 2023ను టార్గెట్ చేసుకొని రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్స్ రెడీ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కూడా శ్రుతిహాసన్ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే తమిళ్ సినిమాలైనా అజిత్ తనీవు, దళపతి విజయ్ వారీసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా తెలుగులో డబ్ అవుతున్నాయి. ఇక సమ్మర్ లో కూడా బడా సినిమాలు సందడి చేయనున్నాయి.
ఇక సమ్మర్ ను టార్గెట్ చేసుకొని వస్తున్న సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించే.. ఈ సినిమాను సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ గతంలోనే అనౌన్స్ చేసింది. అయితే మహేష్ ఇంట వరుస విషాదాలు జరగడంతో ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ తీసుకున్నారు. అయితే ఈ సినిమా ఎలా అయినా అనుకున్న సమయానికి రిలీజ్ చేయాలనీ ప్రయత్నిస్తున్నారు త్రివిక్రమ్. మహేష్ కూడా త్వరలోనే షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారట.
అలాగే మణిరత్నం దర్శకత్వంలో వస్తోన్న పొన్నియన్ సెల్వన్ సినిమా ఏప్రిల్ 28న రాబోతుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ సినిమా కూడా సమ్మర్ లో రిలీజ్ కానుంది అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో చేస్తోన్న జైలర్ సినిమా కూడా సమ్మర్ లోనే రానుంది. ఇక రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర సినిమా సాయి ధరమ్ తేజ్ హీరోగా చేస్తోన్న విరూపాక్ష సినిమాలు సమ్మర్ లో రిలీజ్ కానున్నాయి.