AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Movie Updates: డిసెంబర్‌లో సినిమాల జాతర.. ఎన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయంటే

. అక్కడున్నది 4 శుక్రవారాలు మాత్రమే.. వారానికి ఓ సినిమా.. పోనీ 2 సినిమాలు వేసుకున్నా ఉన్న ప్లేస్ 8 మాత్రమే..! సరిగ్గా ఈ లెక్కలు వేసుకుని డిసెంబర్‌ను హౌజ్ ఫుల్ చేసారు దర్శక నిర్మాతలు. డిసెంబర్‌ హౌజ్ ఫుల్.. టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు కూడా చాలా వరకు అదే నెలలో రాబోతున్నాయి. క్రిస్మస్ హాలీడేస్ క్యాష్ చేసుకోవాలని కొందరు వస్తుంటే.. దానికి ముందే మరికొందరు బరిలోకి దిగుతున్నారు. తాజాగా వరుణ్ తేజ్ కొత్త సినిమా ఆపరేషన్ వాలంటైన్ డిసెంబర్ 8న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది.

Movie Updates: డిసెంబర్‌లో సినిమాల జాతర.. ఎన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయంటే
Tollywood Movies
Rajeev Rayala
|

Updated on: Aug 15, 2023 | 2:02 PM

Share
5 మంది ఎక్కాల్సిన ఆటోలో.. 15 మందిని కుక్కితే ఎలా ఉంటుంది..? ఊహించుకోడానికే భయంగా ఉంది కదా..! డిసెంబర్ నెల విషయంలో టాలీవుడ్ మేకర్స్ చేస్తున్నది చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అక్కడున్నది 4 శుక్రవారాలు మాత్రమే.. వారానికి ఓ సినిమా.. పోనీ 2 సినిమాలు వేసుకున్నా ఉన్న ప్లేస్ 8 మాత్రమే..! సరిగ్గా ఈ లెక్కలు వేసుకుని డిసెంబర్‌ను హౌజ్ ఫుల్ చేసారు దర్శక నిర్మాతలు. డిసెంబర్‌ హౌజ్ ఫుల్.. టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు కూడా చాలా వరకు అదే నెలలో రాబోతున్నాయి. క్రిస్మస్ హాలీడేస్ క్యాష్ చేసుకోవాలని కొందరు వస్తుంటే.. దానికి ముందే మరికొందరు బరిలోకి దిగుతున్నారు. తాజాగా వరుణ్ తేజ్ కొత్త సినిమా ఆపరేషన్ వాలంటైన్ డిసెంబర్ 8న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. అదే రోజు విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా రానుంది.
డిసెంబర్ 1న యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి వంగా వచ్చేస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న ఈ చిత్రంపై సౌత్‌లోనూ అంచనాలు బానే ఉన్నాయి. ఇక డిసెంబర్ 9న దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి నటిస్తున్న సెల్ఫిష్ విడుదల కానుంది. డిసెంబర్ 15న మాత్రం ఇప్పటి వరకు ధనుష్ కెప్టెన్ మిల్లర్ మాత్రమే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకుంది.
ఆ తర్వాత వారం డిసెంబర్ 21న నాని హాయ్ నాన్నతో రానున్నారు.డిసెంబర్ 22న సైంధవ్‌తో వెంకటేష్, హరోం హరతో సుధీర్ బాబు వచ్చేస్తున్నారు. ఆ మరుసటి రోజే ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ అంటూ నితిన్ లైన్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి డిసెంబర్ హౌజ్ ఫుల్ కానీ ఇంకా ఎన్ని సినిమాలు రానున్నాయో ఇప్పుడే చెప్పలేం. వేటికవే సపరేట్ కాన్సెప్టులతో వస్తున్న సినిమాలే ఇవన్నీ.. మరి వీటిలో ఏది ప్రేక్షకుల మనసు దోచుకుంటుందో చూడాలి. నాని హీరోగా తెరకెక్కుతోన్న హాయ్ నాని అనే సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది
View this post on Instagram

A post shared by Nani (@nameisnani)

స్పై థ్రిల్లర్ గా వరుణ్ తేజ్ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హైలైట్ గా ఉండనున్నాయి.

ధనుష్ మిల్లర్ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

View this post on Instagram

A post shared by Dhanush (@dhanushkraja)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చిరంజీవి మారిపోయారా.. బాబీ కోసం ఏం చేస్తున్నారో తెలుసా
చిరంజీవి మారిపోయారా.. బాబీ కోసం ఏం చేస్తున్నారో తెలుసా
ఆ హీరో యాక్టింగ్ చూసి.. నేను గొప్ప నటుడ్ని అనే గర్వం దిగింది'
ఆ హీరో యాక్టింగ్ చూసి.. నేను గొప్ప నటుడ్ని అనే గర్వం దిగింది'
టాలీవుడ్ మార్కెట్ కావాలి.. కానీ తెలుగు టైటిల్స్ పెట్టరా..
టాలీవుడ్ మార్కెట్ కావాలి.. కానీ తెలుగు టైటిల్స్ పెట్టరా..
ఇంటర్ హాల్‌టికెట్ల 2026లో తప్పులు దొర్లాయా? ఇలా సరిచేసుకోండి
ఇంటర్ హాల్‌టికెట్ల 2026లో తప్పులు దొర్లాయా? ఇలా సరిచేసుకోండి
తెలుగు ఇండస్ట్రీలో లక్కీ ఛామ్‌.. ముద్దుగుమ్మ ఉంటే సినిమా హిట్టే
తెలుగు ఇండస్ట్రీలో లక్కీ ఛామ్‌.. ముద్దుగుమ్మ ఉంటే సినిమా హిట్టే
వామ్మో! మరీ ఇలా ప్లాన్ చేసాక.. రౌడీ ఇంక దొరుకుతాడా..
వామ్మో! మరీ ఇలా ప్లాన్ చేసాక.. రౌడీ ఇంక దొరుకుతాడా..
రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పందంగా కనిపించిన యువతి.. ఆపి చెక్ చేయగ
రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పందంగా కనిపించిన యువతి.. ఆపి చెక్ చేయగ
వారణాసి విషయంలో రాజమౌళి సంచలన నిర్ణయం
వారణాసి విషయంలో రాజమౌళి సంచలన నిర్ణయం
ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై వెంకటేష్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్
ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై వెంకటేష్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్
డీఎంకే కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలిః ప్రధాని మో
డీఎంకే కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలిః ప్రధాని మో