Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarath Kumar: ‘కుల విభేదాలకు రాజకీయ నాయకులే కారణం..’ హీరో శరత్ కుమార్ షాకింగ్‌ కామెంట్స్

ఈ సినిమా ఆడియో ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం స్థానిక వడపళనిలోని కమలా థియేటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటుడు శరత్‌ కుమార్‌ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఇస్సక్కీ కార్వానన్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో భగ్గుమంటున్న కుల చిచ్చు ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇది చిత్రం కాదు పాఠం. పుట్టుకతో అందరూ సమానమే. ఎదిగిన తర్వాతే కుల అసమానతలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో కుల వృత్తుల గురించి..

Sarath Kumar: 'కుల విభేదాలకు రాజకీయ నాయకులే కారణం..' హీరో శరత్ కుమార్ షాకింగ్‌ కామెంట్స్
Actor Sarath Kumar
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 16, 2023 | 1:17 PM

కోలీవుడ్‌ నటుడు, దర్శకుడు చేరన్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా మువీ ‘తమిళకుడిమగన్‌’. లక్ష్మీ క్రియేషన్స్‌ నిర్మాణ సంస్థ ఈ మువీని రూపొందించింది. చాలా గ్యాప్‌ తర్వాత ఇసక్కి కార్వణ్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న తమిళకుడిమగన్‌ మువీలో కథానాయకుడిగా మళ్లీ చేరన్‌ కనిపించనున్నారు. లాల్‌, ఎస్‌ఎ చంద్రశేఖర్‌, వేల రామమూర్తి, ధృవ, శ్రీ ప్రియాంక, దీపిక్ష, అరుల్‌దాస్‌, రవిమారియా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్యావ్‌ సీఎస్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సినిమా ఆడియో ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం స్థానిక వడపళనిలోని కమలా థియేటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటుడు శరత్‌ కుమార్‌ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఇస్సక్కీ కార్వానన్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో భగ్గుమంటున్న కుల చిచ్చు ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇది చిత్రం కాదు పాఠం. పుట్టుకతో అందరూ సమానమే. ఎదిగిన తర్వాతే కుల అసమానతలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో కుల వృత్తుల గురించి ప్రస్తావించామన్నారు.

ఇవి కూడా చదవండి

తర్వాత నటుడు శరత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. కుల విభేదాలకు కారణం రాజకియాలేనని వ్యాఖ్యానించారు. మనిషి పుట్టినప్పుడు తన కులమేమిటన్నది తెలియదు. అదేవిధంగా పాఠశాలలో, కాలేజీల్లో అందరూ కలిసి మెలిసి ఆడుకుంటారు. చదువుకుంటారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాతే కుల, మత భేదాలు తలకెక్కుతున్నాయి. కుల వివక్షత రూపుమాపడానికి వేరే రాజకీయం ఉంది.

అదే సమానత్వం. దాని కోసం అందరూ పాటు పడాలి. నేనూ రాజకీయ నాయకుడినే. సమానత్వవం కోసమే నా భవిష్యత్తు కార్యక్రమాలు ఉంటాయి. ‘తమిళకుడిమగన్‌’ నిజాన్ని చెప్పే సినిమా. కులవృత్తి గురించి ఈ సినిమా మాట్లాడుతుంది. కులంపై ఉన్న అభిప్రాయాలను బ్రేక్ చేసే సినిమాగా ‘తమిళకుడిమగన్’ రాబోతోంది. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అని శరత్‌ కుమార్‌ అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.