Anushka Shetty: నవీన్‌కు స్వీటీ ప్రాంక్ కాల్.. ఎలా ఆట పట్టించిందో మీరే చూడండి..

Anushka Shetty: నవీన్‌కు స్వీటీ ప్రాంక్ కాల్.. ఎలా ఆట పట్టించిందో మీరే చూడండి..

Ram Naramaneni

|

Updated on: Aug 15, 2023 | 7:28 PM

అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి జోడిగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం.. తాజాగా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. సెప్టెంబర్ 7న జన్మాష్టమి సందర్భంగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ కానున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. అదే రోజు షారుక్ ఖాన్, నయనతార కలిసి నటించిన జవాన్ కూడా విడుదల కానుంది. దీంతో ఆ సినిమా నుంచి అనుష్క, నవీన్ మూవీకి గట్టి పోటీ ఉండే ఛాన్స్ ఉంది. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రోమోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి – టైటిల్ రోల్స్‌లో నటించిన మిస్ శెట్టి– మిస్టర్ పొలిశెట్టి.. మూవీ రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఈ చిత్రానికి  మహేష్‌ బాబు. పి దర్శకత్వం వహించారు.  రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. కృష్టాష్టమి కానుకగా సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  యూవీ క్రియేషన్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి రధన్ మ్యూజిక్ అందించారు. సినిమాలో నవీన్  స్టాండప్‌ కమెడియన్‌గా, స్వీటి.. చెఫ్‌ పాత్రలో కనిపించబోతున్నారు.  డిఫరెంట్ లవ్‌ స్టోరీగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ తెరకెక్కింది. ఇప్పటికే రిలీజైన ప్రొమోలకు ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తుంది. దాదాపు ఐదున్నర ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులను ఈ సినిమాతో పలకరించబోతుంది అనుష్క. ఈ సందర్భంగా టీవీ9తో ప్రత్యేకంగా మూవీ ముచ్చట్లను పంచుకున్నారు నవీన్. ఈ సమయంలోనే నవీన్‌కు ప్రాంక్ కాల్ చేసి ఆట పట్టించారు అనుష్క. ఆ వీడియోను చూసేద్దాం పదండి.