దీపావళికి థియేటర్లలో .. ఓటీటీలలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..
ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ నడుస్తోంది. పది.. పదిహేను రోజుల గ్యాప్‌తో వరుస పండుగలు.. సెలవులతో ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలతో
ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ నడుస్తోంది. పది.. పదిహేను రోజుల గ్యాప్‌తో వరుస పండుగలు.. సెలవులతో ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలతో తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇందుకు తగినట్టుగానే ఇప్పుడు వెండితెరపై సినిమాలు సైతం సందడి చేస్తున్నాయి. రోజూ రోజూకీ థియేటర్లలో విడుదలయ్యే సినిమాల సంఖ్య పెరుగుతోంది. దసరా కానుకగా పలు చిత్రాలు థియేటర్లలో సందడి చేయగా.. ఇప్పుడు దీపావళీ కోసం మరిన్ని సినిమాలు క్యూ కట్టాయి. దీంతో ఈసారి దీపావళి ఎంతో గ్రాండ్‌గా జరగబోతుంది.కేవలం థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ సినిమాల సందడి ఉండబోతుంది. మరీ ఈ దీపావళీకి ఏయే చిత్రాలు థియేటర్లలో, ఓటీటీలలో విడుదల కాబోతున్నాయో తెలుసుకుందామా.
సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం అన్నాత్తే.. ఇది తెలుగులో పెద్దన్న గా రాబోతుంది.. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో నయనతార హీరోయిన్ గా నటించగా.. కీర్తిసురేష్ రజినీ చెల్లెలుగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది.
అలాగే తమిళంతోపాటు.. తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న నటులు విశాల్, ఆర్య. వీరిద్దరూ కలిపి చేస్తోన్న మల్టీస్టారర్ మూవీ ఎనిమి. ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించగా.. మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో మమతా మోహన్ దాస్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించగా.. మిని స్టూడియోస్ పతాకంపై ఎస్.వినోద్ కుమార్ నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. దీపావళి సందర్భంగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక యంగ్ హీరో సంతోష్ శోభన్.. మెహ్రీన్ జంటగా నటించిన చిత్రం మంచి రోజులు వచ్చాయి. యూవీ కాన్సెప్ట్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది.
తమిళ హీరో సూర్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పుడూ వైవిద్యమైన సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటున్న సూర్య ప్రస్తుతం నటిస్తున్న సినిమా జైభీమ్. ఈ చిత్రానికి తా.సే.జ్ఞానవేల్ దర్శకత్వం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నవంబరు 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.
ఇక యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన చిత్రం గల్లీ రౌడీ. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో సందడి చేయనుంది. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో నవంబరు 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అలాగే.. సుధీర్ బాబు.. ఆనంది జంటగా నటించిన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ జీ5లో నవంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Also Read: క్యా స్టిల్ హై.. రంగు రంగుల్లో మెరుస్తున్న ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టేయండి.. అమ్మడు ఫుల్ హుషారు..