Vinay Prasad: ప్రముఖ నటి ఇంట్లో చోరి.. తాళాలు పగులకొట్టి డబ్బులతో పరార్..

వినయ.. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో దాదాపు 60 సినిమాల్లో నటించారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో సహయ నటిగా కనిపించి మెప్పించారు.

Vinay Prasad: ప్రముఖ నటి ఇంట్లో చోరి.. తాళాలు పగులకొట్టి డబ్బులతో పరార్..
Vinaya Prasad
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 30, 2022 | 12:19 PM

ప్రముఖ నటి వినయ్ ప్రసాద్ ఇంట్లో చోరి జరిగింది. బెంగుళూరులోని నందిని లేఅవుట్‏లో ఉన్న ఆమె నివాసం అక్టోబర్ 22న దొంగలు రెచ్చిపోయారు. ఇంటి తాళాలు పగులగొట్టి లాకర్‏లోని డబ్బులను ఎత్తుకెళ్లారు. దీపావళికి ఉడిపి వెళ్లిన ఆమె 26వ తేదీన ఇంటికి తిరిగి వచ్చింది. ఈ సమయంలో ఇంట్లో చోరీ జరిగినట్లు గమనించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నందిని లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఉడిపి నుంచి అక్టోబర్ 26న సాయంత్రం 4.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటి తాళం పగులగొట్టి దొంగలు ఇంట్లోకి చొరబడినట్లు గుర్తించింది. ఇంట్లోని లాకర్‌లో ఉంచిన నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. పాత దొంగల ముఠా, దోపిడీ దొంగలు, నేర నేపథ్యం ఉన్న వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు.

వినయ.. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో దాదాపు 60 సినిమాల్లో నటించారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో సహయ నటిగా కనిపించి మెప్పించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖి చిత్రంలో కనిపించారు. అలాగే ఇంద్ర, దొంగా దొంగది, ఆంధ్రుడు, దూకుడు వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.

1998 నుంచి 2000 మధ్యలో వచ్చిన స్త్రీ అనే మలయాళ సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు వినయ.. అప్పట్లో ఈ సీరియల్ చాలా పెద్ద హిట్. మలయాళంలో ఈ సీరియల్ ఎంత విజయవంతమైందంటే ఈమె పేరు కేరళలోని ప్రతివారి ఇంట్లో తెలిసే అంత. సావిత్రి సీరియల్ ద్వారా బుల్లితెరలోకి అడుగుపెట్టిన వినయ ప్రసాద్.. శక్తి, అనుపమ, బంగారు, ‘స్త్రీ’, నంద గోకుల, నిత్యోత్సవ, సుందరి వంటి పలు సీరియల్స్‌లో నటించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.