The Warriorr: బుల్లెట్టు పాటకు స్టెప్పులేసిన అలనాటి స్టార్‌ డైరెక్టర్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

Bharathi Raja: యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) నటించిన తాజా చిత్రం ది వారియర్‌ (The Warriorr). బేబమ్మ కృతిశెట్టి (Krithi Shetty) రామ్ సరసన సందడి చేయనుంది. పందెంకోడి సినిమాతో..

The Warriorr: బుల్లెట్టు పాటకు స్టెప్పులేసిన అలనాటి స్టార్‌ డైరెక్టర్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..
The Warriorr

Updated on: Jun 16, 2022 | 12:57 PM

Bharathi Raja: యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) నటించిన తాజా చిత్రం ది వారియర్‌ (The Warriorr). బేబమ్మ కృతిశెట్టి (Krithi Shetty) రామ్ సరసన సందడి చేయనుంది. పందెంకోడి సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్న లింగుస్వామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. కాగా ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచాయి. ముఖ్యంగా బుల్లెట్టు పాట యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. కోలీవుడ్ స్టార్‌ శింబు ఆలపించిన ఈ సాంగ్‌ తాజాగా 100 మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని షేర్‌ చేసుకుంటూ డైరెక్టర్‌ లింగుస్వామి ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్ ఇచ్చారు. దిగ్గజ దర్శకుడు భారతీరాజాతో కలిసి ఆయన బుల్లెట్‌ పాటకు స్టెప్పులేశారు. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌ ద్వారా ఫ్యాన్స్‌ తో పంచుకున్నారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

కాగా ‘16 వయతినిలే’ (పదహారేళ్ల వయసు ఒరిజినల్‌ వెర్షన్‌)తో అందరి దృష్టిని ఆకర్షించారు భారతీరాజా. ఆతర్వాత కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ తదితర స్టార్‌ హీరోలతో సూపర్‌హిట్ సినిమాలు తెరకెక్కించారు. దర్శకుడిగా పలు నేషనల్‌ అవార్డులు, ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాలు అందుకున్నారు. సినిమా రంగంలోని ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఈ దిగ్గజ దర్శకుడిని పద్మశ్రీతో సత్కరించింది. కాగా ఇప్పుడు ఆయన నటుడిగానూ రాణిస్తున్నారు. ఇందులో భాగంగానే రామ్‌ పోతినేని ది వారియర్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా శ్రీనివాసా సిల్వర్‌ స్ర్కీన్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. నదియా, అక్షరడౌడ, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..