తన ఇంటి గేట్లు పెకిలించివేసిన ‘ది రాక్’
డ్వేన్ జాన్సన్..ఈ పేరు చెబితే సదరు వ్యక్తి ఫేస్ అందరికి గుర్తుకురాకపోవచ్చు. 'ది రాక్' అని చెబితే మాత్రం కండలు తిరిగిన దేహం వెంటనే గుర్తుకువస్తుంది.
డ్వేన్ జాన్సన్..ఈ పేరు చెబితే సదరు వ్యక్తి ఫేస్ అందరికి గుర్తుకురాకపోవచ్చు. ‘ది రాక్’ అని చెబితే మాత్రం కండలు తిరిగిన దేహం వెంటనే మైండ్ లో మెదులుతుంది. డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, ప్రజంట్ హాలీవుడ్లో ఆకట్టుకుంటున్నారు నటుడు డ్వేన్ జాన్సన్. ఈ కండల వీరుడు తాజాగా తన ఇంటి గేట్లనే విరగ్గొట్టాడు. పవర్ కట్ వల్ల ఆయన ఇంటి గేట్లు తెరుచుకోలేదు. దీంతో తన కోసం షూటింగ్ లో చాలామంది ఎదురుచూస్తున్నారని, తనే స్వయంగా ఆ గేటును పెకిలించివేసి షూటింగ్‌కు వెళ్లారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
“బహుశా ఈ రోజు నాకు సరిగా లేదు అనుకుంటా. తుఫాను కారణంగా పవర్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా మా ఇంటి గేట్ తెరుచుకోలేదు. వాటిని తెరిచేందుకు హైడ్రాలిక్ సిస్టమ్ ఉపయోగించి చూశా కానీ కుదరలేదు. వెంటనే కొంతమందికి ఫోన్ చేసి గేటును ఎంత త్వరగా ఓపెన్ చేయొచ్చో అడిగా. సుమారు 45 నిమిషాలు పడుతుందని చెప్పారు. కానీ, నా కోసం చాలా మంది షూటింగ్ స్పాట్ లో ఎదురుచూస్తున్నారు. అందుకే గేటును పూర్తిగా నెట్టి, లాగి, పెకిలించేశాను” అని డ్వేన్ జాన్సన్ పేర్కొన్నారు.
ఆ తర్వాత డ్వేన్ జాన్సన్ భద్రత సిబ్బంది ఓ గంట తర్వాత టెక్నీషియన్లను పిలిపించారట. వారు గేటు చూసి భయపడ్డారని, అసలు ఇది ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోయారని డ్వేన్ వివరించారు .
Also Read :
ఏపీలో కల్తీ కూల్ డ్రింక్‌లు.. తస్మాత్ జాగ్రత్త !
క్రికెట్లో రేగిన దుమారం : కత్తులు, గొడ్డళ్లతో
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న తరుణ్ !