AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క ఫోన్ కాల్‌తో రూ.261 కోట్ల దోపిడీ.. అమెరికన్లను వణికించిన ఇండియన్ గ్యాంగ్ గుట్టురట్టు!

అమెరికా పౌరులే టార్గెట్‌గా.. భారత్‌లో ఫేక్ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అంతర్జాతీయ ముఠా గుట్టును ఈడీ రట్టు చేసింది. అమెరికా ప్రభుత్వ అధికారులమంటూ ఫోన్లు చేసి.. డ్రగ్స్, మనీలాండరింగ్ కేసుల్లో ఇరుక్కున్నారంటూ బాధితులను భయపెట్టి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించింది. ఈ కేసులో మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

ఒక్క ఫోన్ కాల్‌తో రూ.261 కోట్ల దోపిడీ.. అమెరికన్లను వణికించిన ఇండియన్ గ్యాంగ్ గుట్టురట్టు!
International Call Centre Scam
Balaraju Goud
|

Updated on: Nov 04, 2026 | 8:09 PM

Share

అమెరికా పౌరులే టార్గెట్‌గా.. భారత్‌లో ఫేక్ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అంతర్జాతీయ ముఠా గుట్టును ఈడీ రట్టు చేసింది. అమెరికా ప్రభుత్వ అధికారులమంటూ ఫోన్లు చేసి.. డ్రగ్స్, మనీలాండరింగ్ కేసుల్లో ఇరుక్కున్నారంటూ బాధితులను భయపెట్టి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించింది. ఈ కేసులో మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేయగా.. తాజాగా మరో నలుగురి అరెస్ట్‌తో మొత్తం ఏడుగురు ఈడీ కస్టడీకి వెళ్లారు. ఇప్పటివరకు ఈ ముఠా ఏకంగా 261 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు డిజిటల్ ఆధారాల్లో బయటపడింది.

సుమారు 20 లక్షల మంది అమెరికా పౌరుల ఫోన్ నంబర్లు, పేర్లు, చిరునామాలు, వయసుకు సంబంధించిన వివరాలను సేకరించింది. జర్మనీ, ఫిన్లాండ్‌లోని సర్వర్ల ద్వారా ఆటో డయలర్లను ఉపయోగించి బాధితులకు ఫోన్లు చేసేది. మీ బ్యాంకు ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని.. మీ కంప్యూటర్‌లో వైరస్ ఉందని నమ్మించేది. ఆ తర్వాత అమెరికా ప్రభుత్వ సంస్థలైన డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ అధికారులమంటూ పరిచయం చేసుకునేవారు. నకిలీ ఐడీ కార్డులు, బ్యాడ్జీలు, కోర్టు ఉత్తర్వులు చూపిస్తూ బాధితులను భయభ్రాంతులకు గురిచేసేవారు.

ఈ ఫేక్ కాల్ సెంటర్లలో ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. డయలర్లు మొదట బాధితులకు ఫోన్ చేసి మాట్లాడేవారు. బ్యాంకర్లు బాధితుల బ్యాంకు ఖాతాలు, ఆర్థిక వివరాలను పరిశీలించేవారు. చివరగా క్లోజర్లు అమెరికా అధికారులుగా నటిస్తూ అరెస్ట్ చేస్తామని, ఖాతాల్లోని డబ్బులు సీజ్ చేస్తామని బెదిరించేవారు. దీంతో బాధితులు నగదు, బంగారం, గిఫ్ట్ కార్డులు, బ్యాంకు బదిలీల రూపంలో డబ్బులు అప్పగించేవారు. పటియాలాలో రెండు, పుణెలో ఒకటి.. మొత్తం మూడు ఫేక్ కాల్ సెంటర్లను ఈడీ గుర్తించింది. తనిఖీల సమయంలో సుమారు 220 మంది అక్కడ పనిచేస్తున్నట్లు గుర్తించింది. పటియాలా కాల్ సెంటర్లలో 242 మంది సిబ్బందిని నియమించినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది.

ఈ ముఠా వసూలు చేసిన డబ్బును నేరుగా భారత్‌కు తరలించకుండా అంతర్జాతీయ మార్గాలను ఉపయోగించినట్లు ఈడీ గుర్తించింది. అమెరికాలోని మ్యూల్ బ్యాంకు ఖాతాలు, దుబాయ్, హాంకాంగ్ కంపెనీల ద్వారా డబ్బును మళ్లించింది. అనంతరం క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్, హవాలా, అంగడియా మార్గాల్లో భారత రూపాయలుగా మార్చినట్లు గుర్తించింది. 2025 జూలై నుంచి 2026 సెప్టెంబర్ వరకు 927 లావాదేవీల ద్వారా 27.39 మిలియన్ అమెరికన్ డాలర్లు.. అంటే సుమారు 261 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు డిజిటల్ ఆధారాల్లో తేలింది. ఇప్పటివరకు 549 మంది అమెరికా పౌరులను బాధితులుగా గుర్తించగా.. 6,463 ఫోన్ నంబర్లకు కాల్స్, మెసేజ్‌లు పంపినట్లు వెల్లడైంది. 397 అమెరికా బ్యాంకు ఖాతాల వివరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో హర్షిల్ రావల్, జస్వంత్ సింగ్, చేతన్ ముంజాల్, ప్రణవ్ పిథాడియాలను తాజాగా అరెస్ట్ చేసిన ఈడీ.. ఇప్పటికే మరో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మొత్తం ఏడుగురిని నాంపల్లి ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది. మరోవైపు ఈ ముఠా అక్రమంగా సంపాదించిన సొమ్ము ఎక్కడెక్కడికి చేరింది.. ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది.. ఎన్ని ఆస్తులు కూడబెట్టారనే కోణంలో ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అమెరికన్లే టార్గెట్.. రూ.261 కోట్లు కొల్లగొట్టిన ముఠా!
అమెరికన్లే టార్గెట్.. రూ.261 కోట్లు కొల్లగొట్టిన ముఠా!
నిరంతరం బాలిక క్షేమసమాచారాలు ప్రజలకు చేరవేస్తున్న నారా లోకేశ్
నిరంతరం బాలిక క్షేమసమాచారాలు ప్రజలకు చేరవేస్తున్న నారా లోకేశ్
దీపావళి పొల్యూషన్.. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి యమ డేంజర్!
దీపావళి పొల్యూషన్.. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి యమ డేంజర్!
చోరీ నిందతో మనస్తాపం.. రైలు కింద పడి 17 ఏళ్ల బాలుడి ఆత్మహత్య
చోరీ నిందతో మనస్తాపం.. రైలు కింద పడి 17 ఏళ్ల బాలుడి ఆత్మహత్య
భూమి వైపు దూసుకొస్తున్న నాసా టెలిస్కోప్‌ .. భారత్‌లో శకలాలు!
భూమి వైపు దూసుకొస్తున్న నాసా టెలిస్కోప్‌ .. భారత్‌లో శకలాలు!
ఓటమి తర్వాత రివర్స్ కలెక్షన్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
ఓటమి తర్వాత రివర్స్ కలెక్షన్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
మూడు నెలల తర్వాత సడన్‌గా ఓటీటీలోకి రొమాంటిక్ మూవీ
మూడు నెలల తర్వాత సడన్‌గా ఓటీటీలోకి రొమాంటిక్ మూవీ
టికెట్‌ ఇవ్వని పార్టీలకు రెబల్స్ ఝలక్..
టికెట్‌ ఇవ్వని పార్టీలకు రెబల్స్ ఝలక్..
  ఈ ఒక్క కొమ్మ ఉంటే చాలు.. బాల్కనీ నిండా పచ్చని పుదీనా తోట
  ఈ ఒక్క కొమ్మ ఉంటే చాలు.. బాల్కనీ నిండా పచ్చని పుదీనా తోట
సబ్బుతో రుద్దినా పోని బకెట్ మరకలు.. ఈ పదార్థాలతో మొత్తం క్లీన్!
సబ్బుతో రుద్దినా పోని బకెట్ మరకలు.. ఈ పదార్థాలతో మొత్తం క్లీన్!