The Raja Saab Pre Release Event: కైతలపూర్ గ్రౌండ్‌లోనే ది రాజా సాబ్ ఈవెంట్ ఎందుకు? పర్మిషన్ ఎంతమందికంటే?

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ది రాజా సాబ్. సంక్రాంతి కానుకగా త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రమోషన్లలో భాగంగా శనివారం (డిసెంబర్ 27) ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.

The Raja Saab Pre Release Event: కైతలపూర్ గ్రౌండ్‌లోనే ది రాజా సాబ్ ఈవెంట్ ఎందుకు? పర్మిషన్ ఎంతమందికంటే?
The Raja Saab Pre Release Event

Updated on: Dec 27, 2025 | 7:50 PM

ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభమైంది. హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి సమీపంలోని కైతలపూర్ గ్రౌండ్ లో ఈ గ్రాండ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. కాగా ముందుగా ఈ ఈవెంట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. కొన్ని రోజుల క్రితం అక్కడ జరిగిన మహేష్ వారణాసి ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. దీంతో ప్రభాస్ మూవీ ఈవెంట్ ను కూడా అక్కడే ప్లాన్ చేశారని రూమర్స్ వినిపించాయి. రామోజీ ఫిల్మ్ సిటీ కాకపోయినా కనీసం పెద్ద గ్రౌండ్ లోనే ఈ మూవీ ఈవెంట్ నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా వేదిక మారింది. చివరికి కైతలపూర్ గ్రౌండ్ లో ది రాజాసాబ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి కేవలం ఎనిమిది వేల మంది అభిమానులకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇలా అనూహ్యంగా ది రాజా సాబ్ ఈవెంట్ ను మార్చడానికి చాలా కారణాలున్నాయని చిత్ర బృందం చెబుతోంది.

‘ ప్రభాస్ సినిమా ప్రీ రిలీజ్ పెద్ద గ్రౌండ్ లోనే నిర్వహించాలని ప్లాన్ చేశాం. కానీ త్వరలోనే న్యూ ఇయర్ రాబోతుంది. ఇప్పుడు పెద్ద గ్రౌండ్ లో ఈవెంట్ ను నిర్వహిస్తే భారీ స్థాయిలో బందోబస్తు అవసరమవుతుంది. అందుకే అభిమానుల భద్రతను దృష్టిలో ఉంచుకునే కైతలపూర్ గ్రౌండ్ ను ఎంపిక చేశాం’ అని చిత్ర బృందం పేర్కొంది.

కాగా ప్రభాస్ ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అట్టహాసంగా ఏర్పాట్లు జరిగాయి. ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత ప్రభాస్ మీడియా ముందుకు రానున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ స్పీచ్ వినేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు

ఇవి కూడా చదవండి

ప్రభాస్ ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.