
సలార్, కల్కి వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ది రాజా సాబ్. కామెడీ, హారర్ థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఫాంటసీ హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ హీరో పక్కన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవికా మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ డార్లింగ్ తో రొమాన్స్ చేయనున్నారు. అలాగే బాలీవుడ్ నటులు సంజయ్ దత్, అనుపమ్ ఖేర్, జరీనా వాహాబ్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సప్తగిరి లాంటి స్టార్ కమెడియన్స్ కూడా ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగమయ్యారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు థమన్ స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే రిలీజైన పాటలు, గ్లింప్స్ , ట్రైలర్స్ రాజాసాబ్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 09న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే ది రాజా సాబ్ సినిమాను సుమారు రూ.450 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ స్టార్స్ రెమ్యునరేషన్ పై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాగా ది రాజాసాబ్ సినిమాకు ప్రభాస్ తన రెగ్యులర్ రెమ్యునరేషన్ కంటే తక్కువగానే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి డార్లింగ్ కేవలం రూ.100 కోట్లు తీసుకున్నాడని టాక్. ప్రభాస్ తర్వాత డైరెక్టర్ మారుతి దాదాపు రూ. 18 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి తర్వాత బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ దాదాపు రూ.5 నుంచి రూ.6 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్.
ఇక హీరోయిన్ల విషయానికొస్తే కోలీవుడ్ భామ మాళవికా మోహనన్ రూ.2 కోట్లు, నిధి అగర్వాల్ రూ.1.5 కోట్లు, రిద్ధి కుమార్ రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. వీరితో పాటు బ్రహ్మనందం రూ.80 లక్షల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు సప్తగిరి, అనుపమ్ ఖేరలకు కూడా భారీగానే పారితోషికం అందినట్లు సమాచారం.
The season of joy meets the season of STYLE 😎
Team #TheRajaSaab wishes you all a very Happy New Year ❤️🔥
A perfect Sankranthi BLOCKBUSTER loading on the big screens 🔥#TheRajaSaabOnJan9th #Prabhas @DirectorMaruthi @vishwaprasadtg @peoplemediafcy @MusicThaman @AAFilmsIndia… pic.twitter.com/sDDhHuOSYa
— People Media Factory (@peoplemediafcy) January 1, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.