AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇద్దరు మిత్రులు మూవీలో అక్కినేనికి డూప్‌గా నటించింది ఎవరో తెలిస్తే స్టన్

అక్కినేని నాగేశ్వరరావు తొలి ద్విపాత్రాభినయ చిత్రం ఇద్దరు మిత్రులు. బెంగాలీ చిత్రం తాషేర్ ఘర్ స్ఫూర్తితో అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా 1961లో విడుదలై ఘన విజయం సాధించింది. ఇందులో నాగేశ్వరరావు డూప్‌గా నటించింది ఎవరంటే.? ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Tollywood: ఇద్దరు మిత్రులు మూవీలో అక్కినేనికి డూప్‌గా నటించింది ఎవరో తెలిస్తే స్టన్
Anr
Ravi Kiran
|

Updated on: Feb 20, 2026 | 1:29 PM

Share

అక్కినేని నాగేశ్వరరావు ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రం ఇద్దరు మిత్రులు తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం బెంగాలీ హిట్ తాషేర్ ఘర్ ఆధారంగా రూపొందింది. దర్శకుడు ఆదిత్య సుబ్బారావు, నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు, సహాయ దర్శకుడు కే విశ్వనాథ్, జర్నలిస్ట్ గోరా శాస్త్రి బృందం మూల కథలో కొన్ని సన్నివేశాలు మాత్రమే తీసుకుని సరికొత్త కథను రూపొందించారు. డాక్టర్ కొర్రపాటి గంగాధర రావు మాటలు అందించారు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యం తక్కువ కావడంతో రాజసులోచన, ఈవి సరోజ హీరోయిన్లుగా నటించగా, శారద కోసం ప్రత్యేకంగా ఒక పాత్రను సృష్టించారు. గుమ్మడి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించారు. 1961 డిసెంబరు 29న విడుదలైన ఇద్దరు మిత్రులు ఘన విజయం సాధించింది. ANR నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఇదిలా ఉంటే.. ఇందులో నాగేశ్వరరావు డూప్‌గా నటించింది ఎవరంటే.! సాధారణంగా ద్విపాత్రాభినయం అనగానే ఒకే పోలికలతో ఉన్న అన్నదమ్ముల కథ అనుకుంటారు. కానీ ఇద్దరు మిత్రులు చిత్రంలో ఇద్దరు హీరోలకు ఎటువంటి రక్త సంబంధం ఉండదు. కేవలం ఒకే పోలికలతో ఉంటారు అంతే. తాషేర్ ఘర్లో ఉత్తమ్ కుమార్‌కు ఆయన తమ్ముడు పరున్ కుమార్ డూప్‌గా నటించగా, ఇద్దరు మిత్రులులో అక్కినేని నాగేశ్వరరావుకు జగన్నాథరావు అనే ఆర్టిస్ట్ డూప్‌గా నటించారు. మసక వెలుతురులో చూస్తే ఆయన అచ్చం అక్కినేనిలా ఉండేవారు. సినిమాటోగ్రాఫర్ సెల్వరాజ్ అప్పట్లో అందుబాటులో ఉన్న సాంకేతిక సౌకర్యాలతో ద్విపాత్రాభినయ సీన్స్ అద్భుతంగా చిత్రీకరించారు. ఇద్దరు మిత్రులు షూటింగ్ ఎక్కువగా మద్రాసులో జరిగింది. మ్యాచింగ్ సీన్లను మాత్రం హైదరాబాద్‌లో చిత్రీకరించారు. ఈ చిత్ర నిర్మాణం ఆ రోజుల్లో పెద్ద సంచలనం. ద్విపాత్రాభినయ సన్నివేశాలు ఎలా చిత్రీకరిస్తున్నారా అనే కుతూహలం అందరిలో ఉండేది.

Follow Us
కోహ్లీ కాదు.. ఐపీఎల్‌కు కొత్త 'కింగ్' ఇతడే..
కోహ్లీ కాదు.. ఐపీఎల్‌కు కొత్త 'కింగ్' ఇతడే..
పోయిన వస్తువులు తిరిగి రావాలా? అప్పులు వసూలవ్వాలా? ఏ దేవుడిని..
పోయిన వస్తువులు తిరిగి రావాలా? అప్పులు వసూలవ్వాలా? ఏ దేవుడిని..
తులం బంగారం ధర కేవలం రూ.90 మాత్రమే.. పాలు, చక్కెర ధరలు వింటే షాక్
తులం బంగారం ధర కేవలం రూ.90 మాత్రమే.. పాలు, చక్కెర ధరలు వింటే షాక్
సహజంగా ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోండి.. అద్భుతమైన భారతీయ హోం రెమెడీస్
సహజంగా ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోండి.. అద్భుతమైన భారతీయ హోం రెమెడీస్
విజయ్‌కి తల్లిగా, భార్యగా నటించిన ఏకైక టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే?
విజయ్‌కి తల్లిగా, భార్యగా నటించిన ఏకైక టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే?
మామిడి ఆకుల తోరణం ఎండిపోయిందా? ఇలా చేస్తేనే శుభ ఫలితాలు పొందుతారు
మామిడి ఆకుల తోరణం ఎండిపోయిందా? ఇలా చేస్తేనే శుభ ఫలితాలు పొందుతారు
వీరు మాములోళ్లు కాదు.. A అక్షరంతో పేరు ఉన్నవారి వ్యక్తిత్వం ఇదే
వీరు మాములోళ్లు కాదు.. A అక్షరంతో పేరు ఉన్నవారి వ్యక్తిత్వం ఇదే
Garuda Purana: మరణం తర్వాత స్వర్గానికి వెళ్లాలంటే ఏం చేయాలి?
Garuda Purana: మరణం తర్వాత స్వర్గానికి వెళ్లాలంటే ఏం చేయాలి?
నెలకు రూ.10,000 పెట్టుబడి.. 10 ఏళ్లలో రూ. 34 లక్షల లాభం..
నెలకు రూ.10,000 పెట్టుబడి.. 10 ఏళ్లలో రూ. 34 లక్షల లాభం..
ఇది చెంచాడు ఇస్తే చాలు.. మల్లెమొక్క గుత్తులు గుత్తులుగా..
ఇది చెంచాడు ఇస్తే చాలు.. మల్లెమొక్క గుత్తులు గుత్తులుగా..