Simhadri Movie: ఆ కారణంతో సినిమాలకు దూరమైన సింహాద్రి హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోయిన హీరోయిన్స్ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అందులో అంకిత ఒకరు. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు కొట్టేసింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడేం చేస్తుందంటే..

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటిన హీరోయిన్లలో అంకిత ఒకరు. మ్యూజికల్ సూపర్ హిట్ లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి ప్రయత్నంలోనే సినీప్రియులను ఆకట్టుకుంది. అందం, అభినయంతో కట్టిపడేసింది. ఈ చిత్రంలో అమాయకంగా కనిపిస్తూనే సహజ నటనతో ప్రశంసలు అందుకుంది. దీంతో ఈ అమ్మడుకు తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ధనలక్ష్మీ.. ఐ లవ్ యూ, ప్రేమలో పావని కళ్యాణ్ వంటి చిత్రాల్లో నటించింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ సరసన సింహాద్రి మూవీతో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీతో ఆమె కెరీర్ మలుపు తిప్పింది. ఇందులో భూమిక సైతం కథానాయికగా కనిపించింది. అయితే ఈ సినిమాతో ఆమెకు వరుస ఆఫర్స్ వస్తాయని అనుకున్నారు . కానీ అలా జరగలేదు. తెలుగులో ఈ బ్యూటికి ఊహించినంతగా అవకాశాలు రాలేదు.
సింహాద్రి సినిమా తర్వాత 2009 వరకు వరుస సినిమాలు చేసింది అంకిత. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ఆమె చివరిసారిగా పోలీస్ అధికారి చిత్రంలో నటించింది. ఆ తర్వాత సినిమాల్లో నటించలేదు. అయితే అందుకు గల కారణాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది అంకిత. విజయేంద్రవర్మ సినిమాపై తాను ఎన్నో ఆశలు పెట్టుకున్నా అని.. అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయిందని.. ఆ సినిమా సక్సెస్ అయి ఉంటే తాను ఇండస్ట్రీలో ఉండేదాన్ని అని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే కెరీర్ కొనసాగుతుందంటూ తెలిపింది.
కెరీర్ నెమ్మదిగా స్లో కావడంతో ఇండస్ట్రీకి దూరమైన అంకిత.. వ్యాపారవేత్త విశాల్ జగపతిని 2016లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత భర్తతో కలిసి న్యూజెర్సీలో స్థిరపడ్డారు. ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు. అలాగే అంకిత సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది అంకిత.

Ankitha News
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..




