Thalapathy66 : హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన దళపతి.. శరవేగంగా విజయ్ నయా మూవీ షూటింగ్
స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దళపతి ఫ్యాన్స్ ను నిరాశ పరిచింది.
స్టార్ హీరో దళపతి విజయ్(Thalapathy vijay )నటించిన బీస్ట్(Beast) సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దళపతి ఫ్యాన్స్ ను నిరాశ పరిచింది. తమిళ్ లో పర్లేదు అనిపించుకున్న ఈ సినిమా తెలుగులో మాత్రం నిరాశపరిచింది. దాంతో విజయ్ నటించనున్న నెక్స్ట్ సినిమా పై ఆసక్తి పెరిగింది విజయ్ ఫ్యాన్స్ కి. ఓ సాలిడ్ హిట్ కావాలంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు. విజయ్ తన నెక్స్ట్ సినిమా టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో చేస్తున్న విషయం తెలిసిందే. వంశీ మహర్షి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్న సినిమా ఇది. ఇటీవలే ఈ సినిమా పూజాకార్యక్రమాలు హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సినిమాలో దళపతికి జోడిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తుంది. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిచనున్నారు.
తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా కోసం వంశీ ఓ పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేశారని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ కొత్త షెడ్యూల్ పదిరోజుల పాటు హైదరాబాద్ లోనే ఉంటుందని తెలుస్తుంది.ఇప్పటికే విజయ్ హైదరాబాద్ లో లాండ్ అయ్యాడు. అలాగే ఈ షెడ్యూల్ లో హీరోయిన్ రష్మిక మందన్న కూడా జాయిన్ అవుతుందట. తొలి షెడ్యూల్ పూర్తిగా విజయ్..ఇతర కీలక నటులపైన సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం. హైదరాబాద్ తర్వాత విదేశాలకు వెళ్లనున్నరట చిత్రయూనిట్. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు. సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమా షూటింగ్ నిర్వహించనున్నారని సమాచారం.
మరిన్ని ఇక్కడ చదవండి :