Thalapathy Vijay : కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తెలుగు సినిమా.. అఫిషియల్‌గా అనౌన్స్ చేసిన మేకర్స్..

తమిళ్ స్టార్ దళపతి విజయ్ సినిమాలు తెలుగులోనూ ఏ రేంజ్‌లో ప్రేక్షకులను అలరిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Thalapathy Vijay : కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తెలుగు సినిమా.. అఫిషియల్‌గా అనౌన్స్ చేసిన మేకర్స్..
Vijay
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 26, 2021 | 7:54 PM

Thalapathy Vijay : తమిళ్ స్టార్ దళపతి విజయ్ సినిమాలు తెలుగులోనూ ఏ రేంజ్‌లో ప్రేక్షకులను అలరిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఈ క్రమంలో విజయ్ నటించిన సినిమాలు ఇటీవల కాలంలో వందకోట్లను చాలా అవలీలగా దాటేస్తున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ ఇప్పుడు డైరెక్ట్‌గా తెలుగులో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ సినిమా చేయనున్నాడని నిన్నటి వరకు వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు ఈ వార్తల పై క్లారిటీ వచ్చింది. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి సినిమా చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్ . దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారు. దిల్ రాజు బ్యానర్‌లో వంశీ మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే..

దళపతి  66వ సినిమాను వంశీ పైడిపల్లి తెరకెక్కించబోతున్నాడు. నా తర్వాత సినిమా గురించి ఈ ఎగ్జైటింగ్ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థలపతి విజయ్‌తో నా సినిమాను దిల్ రాజు గారు – శిరీష్ గారు నా హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో నిర్మాణం జరుగబోతుంది అంటూ ప్రకటించారు వంశీ పైడిపల్లి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కూడా  సినిమాను అనౌన్స్ చేస్తూ.. హీరో విజయ్, దిల్ రాజు, వంశీ పైడిపల్లి కలిసున్న ఫొటోను కూడా పంచుకుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ఆరంభంలోనే సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sitara Photos: ఇన్‌స్టాలో సితార ఘట్టమనేని క్రేజ్ మామూలుగా లేదుగా.. లేటెస్ట్ క్యూట్ పిక్స్..

Sampoornesh Babu: మంత్రి అనీల్ కుమార్ వ్యాఖ్యలపై స్పందించిన హీరో సంపూర్ణేష్ బాబు.. ఏమన్నారంటే.

Bigg Boss Telugu 5: ఆ కంటెస్టెంట్‌ను కావాలనే నెగిటివ్‌గా చూపిస్తున్నారు.. బిగ్ బాస్ మీద ఫైర్ అవుతున్న నెటిజన్లు