Thalapathy Vijay: దళపతి విజయ్ ఆఖరి సినిమా.. పారితోషికం ఎన్ని కోట్లో తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయ్‌

దళపతి విజయ్ ఇప్పుడు 'జన నాయగన్' సినిమాలో నటిస్తున్నాడు. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండటంతో ఇది విజయ్ ఆఖరి సినిమా అని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఈ సినిమా కోసం విజయ్ తీసుకుంటోన్న రెమ్యునరేషన్ పై కూడా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆఖరి సినిమా.. పారితోషికం ఎన్ని కోట్లో తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయ్‌
Thalapathy Vijay

Updated on: Jun 26, 2025 | 7:57 AM

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఇప్పుడు తన 69వ చిత్రం ‘జన నాయగన్’ సినిమా షూటింగులో బిజీగా ఉంటున్నాడు. దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే సినిమా నుంచి తరచూ అప్డేట్స్ వస్తున్నాయి . ఇటీవల దళపతి విజయ్ 51వ పుట్టినరోజు సందర్భంగా, చిత్ర బృందం జన నాయగన్ చిత్రం నుంచి విజయ్ పాత్రను పరిచయం చేస్తూ ఓ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేసింది. దీనికి విజయ్ అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘జన నాయగన్’ చిత్రంలో విజయ్ పవర్ ఫుల్ పోలీసు అధికారిగా నటిస్తున్నాడు. ఇక బీస్ట్ సినిమా తర్వాత, నటి పూజా హెగ్డే మరోసారి విజయ్ సరసన కథానాయికగా నటిస్తోంది. అలాగే, ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమాలో విజయ్ కి విలన్ గా నటిస్తున్నారు. వీరితో పాటు ప్రియమణి, నరేన్, మమితా బైజు, వరలక్ష్మి ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9, 2026న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం గతంలో ప్రకటించింది.

కాగా జన నాయగన్ విజయ్ ఆఖరి సినిమా అని ప్రచారం జరుగుతోంది. దీనిని అతను అధికారికంగా ప్రకటించకపోయినా ప్రస్తుతం పరిస్థితని బట్టి చూస్తే ఇది నిజమనిపిస్తోంది. ఎందుకంటే విజయ్ ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లోనూ బిజి బిజీగా ఉంటున్నాడు. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. ఇందుకోసం పార్టీని అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నారు విజయ్.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే జన నాయగన్’ కోసం విజయ్ రూ. 275 కోట్ల పారితోషికం అందుకోనున్నట్లు సమాచారం. ఈ మొత్తాన్ని ఆయన రెమ్యునరేషన్ గానే తీసుకోనున్నారని తెలుస్తోంది. సినిమా లాభాల నుంచి ఎలాంటి వాటా తీసుకోవడం లేదని తెలుస్తోంది. అయితే ఇది ప్రస్తుతానికి కేవలం రూమర్లు మాత్రమే. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

 జన నాయగన్ సినిమాలో విజయ్ దళపతి..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి