Thalapathy Vijay: హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న దళపతి తనయుడు.. ఆ టాలీవుడ్ సూపర్ హిట్ ను రీమేక్ చేయనున్నాడా..?
రీసెంట్ గా వారసుడు సినిమాతో హిట్ అందుకునోరు విజయ్. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలై మంచి హిట్ గా నిలిచింది. రెండు భాషల్లోనూ మంచి కలెక్షన్స్ సాధించింది.
దళపతి విజయ్ క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. తెలుగులో కూడా ఆయనకు మంచి మార్కెట్ ఉంది. విజయ్ నటించిన సినిమాలు అవలీలగా 100 కోట్ల మార్క్ ను రీచ్ అవుతుంటాయి. రీసెంట్ గా వారసుడు సినిమాతో హిట్ అందుకునోరు విజయ్. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలై మంచి హిట్ గా నిలిచింది. రెండు భాషల్లోనూ మంచి కలెక్షన్స్ సాధించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు విజయ్ తనయుడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడని కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ తనయుడు సంజయ్ హీరోగా ఉప్పెన సినిమా రీమేక్ ను చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.
తెలుగులో బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా వంద కోట్ల వరకు వసూల్ చేసింది.
అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది . ఈ సినిమాలో విజయ్ సేతుపతి నెగిటివ్ పాత్రలో నటించారు. ఇప్పుడు ఇదే సినిమాను తమిళ్ లో రీమేక్ చేయనున్నారని తెలుస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమా ల్లో నటించిన సంజయ్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా కన్ఫామ్ అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కృతిశెట్టినే హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని టాక్ కోలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది.