Jana Nayagan: విజయ్ దళపతి చివరి సినిమా రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. కరెక్ట్ టైం చూసుకుని దిగుతోన్న జన నాయగన్
దళపతి విజయ్ 69వ సినిమా రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇప్పటికే రాజకీయాల్లో బిజి బిజీగా ఉంటోన్న విజయ్ కు ఇదే చివరి సినిమా. హెచ్. వినోద్ తెరెక్కిస్తోన్న ఈ సినిమాను కెవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

దళపతి విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ జనవరి 9, 2026న విడుదల కాబోతోందని మేకర్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దళపతి విజయ్ సినీ ప్రయాణానికి నివాళిలా ఈ చిత్రం ఉంటుందని మేకర్లు ఇది వరకు చెప్పేశారు. తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించి మరింతగా హైప్ క్రియేట్ చేశారు. దళపతి విజయ్ నటిస్తున్న ఈ జన నాయగన్ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దించుతున్నారు. సంక్రాంతి సందడి మొదలయ్యే కంటే ముందే బాక్సాఫీస్ వద్ద విజయ్ సందడి షురూ కానుంది. కోలీవుడ్‌లో పొంగల్ అంటే విజయ్ సాధించిన రికార్డులు, వసూళ్ల వర్షం అందరికీ గుర్తుకు వస్తుంటుంది. ఇక చివరగా ఇలా సంక్రాంతి బరిలోకి విజయ్ వచ్చి రికార్డులు సునామీని సృష్టించబోతోన్నారని అందరికీ అర్థమై ఉంటుంది. విజయ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. స్టైలీష్ లుక్‌లో విజయ్ తన ఫ్యాన్స్‌ను ఇట్టే కట్టిపడేశారు. ఫార్స్ ఫిల్మ్ ద్వారా ఓవర్సీస్‌లో ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఇక విజయ్ నటించే చివరి చిత్రం అవ్వడంతో చెన్నై నుంచి చికాగో.. ముంబై నుంచి మెల్‌బోర్న్ వరకు అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
ప్రస్తుతం కేవీఎన్ ప్రొడక్షన్స్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’, ‘జన నాయగన్’ వంటి భారీ చిత్రాల నిర్మాణంలో బిజీగా ఉంది. ఇక జన నాయగన్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్నాడు. వీరితో పాటుప్రియమణి, శ్రుతి హాసన్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాశ్ రాజ్, నరైన్, రెబా మోనికా జాన్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నాడు.
సంక్రాంతి బరిలోనే దళపతి విజయ్..
Adiyum othaiyum kalanthu vechu vidiya vidiya virundhu vecha.. #JanaNayaganPongal 🔥
09.01.2026 ❤️#JanaNayaganFromJan9#Thalapathy @actorvijay sir #HVinoth @thedeol @prakashraaj @menongautham #Priyamani @itsNarain @hegdepooja @_mamithabaiju @anirudhofficial @Jagadishbliss… pic.twitter.com/hIhBlFWVzg
— KVN Productions (@KvnProductions) March 24, 2025
జన నాయగన్ సినిమాలో విజయ్ దళపతి..
Nan Aanai ittal…….. Adhu…….🔥#JanaNayaganSecondLook#NanAanaiittal#JanaNayaganVijay#Thalapathy @actorvijay sir #HVinoth @thedeol @prakashraaj @hegdepooja @_mamithabaiju @anirudhofficial @Jagadishbliss @LohithNK01 @sathyaDP @PradeepERagav @RIAZtheboss #ஜனநாயகன் pic.twitter.com/ffkx40TqEA
— KVN Productions (@KvnProductions) January 26, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.