Tollywood: ఏంటీ మావా క్రేజ్.. సిల్క్ స్మిత సగం కొరికిన యాపిల్ వేలం.. ఎంత పలికిందో తెలిస్తే..
సిల్క్ స్మిత క్రేజ్ అంటే మాములుగా ఉండదు. ఇప్పటికీ ఆమె ఫ్యాన్స్ ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. 1980, 90 దశకాల్లో దక్షిణాది ఇండస్ట్రీలను ఓ ఊపు ఊపేసిన అలనాటి నటి. అందం, అభినయంతో కుర్రాళ్లకు కలల రాణిగా మారింది. ఆమె జీవితంలోని ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు చూద్దాం..

సిల్క్ స్మిత.. 1980, 90 దశకాల్లో టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన బ్యూటీ. తన అందంతో ఎంతోమంది కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. సుమారు 300కిపైగా చిత్రాల్లో నటించిన సిల్క్ స్మిత.. ఏ సినిమాలో నటిస్తే.. ఆ మూవీ హిట్ అని నమ్మేవారు అప్పటి నిర్మాతలు. అంతేకాదు అప్పటి టాప్ హీరోలు అందుకునే పారితోషికానికి సమానంగా రెమ్యునరేషన్ తీసుకునేది సిల్క్ స్మిత. అంతటి డబ్బు, పేరు ప్రతిష్టలు సంపాదించినా ఈ బ్యూటీ.. తాను చనిపోయే చివరి రోజుల్లో ఎంతో నరకాన్ని అనుభవించింది. ఇక సిల్క్ స్మిత సినిమాలు చేస్తున్న సమయంలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.
ఓ సినిమా షూటింగ్ బ్రేక్ సమయంలో సిల్క్ స్మిత ఒక యాపిల్‌ను తింటుండగా.. డైరెక్టర్ ఆమెను షాట్ రెడీ అని పిలిచాడు. దీంతో ఆమె ఆ యాపిల్‌ను సగం కొరికి అక్కడే వదిలేసి వెళ్లింది. ఇక సెట్‌లో ఉన్న ఓ వ్యక్తి ఆ యాపిల్‌ను చూసి.. దాన్ని తీసుకుని పారిపోయాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఆ యాపిల్‌ను వేలంలో పెట్టగా.. ఆ వేలం రూ. 2తో స్టార్ట్ అయ్యి.. రూ.1 లక్ష వరకు వెళ్లిందని పలు కథనాలు చెబుతున్నాయి. చివరికి సిల్క్ స్మిత సగం కొరికిన ఆ యాపిల్ రూ. 1 లక్షకు అమ్ముడైందని అంటుంటారు. ఇప్పటికీ ఈ వార్తను సిల్క్ స్మిత అభిమానులు చెప్పుకుంటూనే ఉంటారు.
1960, డిసెంబర్ 2న ఏలూరు సమీపాన ఉన్న దెందులూరులో జన్మించింది సిల్క్ స్మిత. ఆమె అసలు పేరు విజయలక్ష్మీ. ఈమెకు 15 ఏళ్లకే పెళ్లి అయింది. అయితే అత్తింటివారు పెట్టే వేధింపులను భరించలేని సిల్క్ స్మిత.. మద్రాస్ వెళ్ళిపోయి.. టచప్ ఆర్టిస్టుగా తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత చిన్నచిన్న రోల్స్ చేసి.. ‘ఇనయే తేడి’ అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆపై ‘వండిచక్రం’ అనే మూవీ సిల్క్ స్మితకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సమయంలోనే విజయలక్ష్మీగా ఉన్న తన పేరును సిల్క్ స్మితగా మార్చుకుంది. జయమాలిని, జ్యోతిలక్ష్మి వంటి స్టార్స్ ఉన్న ఆ సమయంలో సిల్క్ స్మిత కుర్రాళ్లకు క్రేజీ నటిగా మారడమే కాకుండా.. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాల్లో వందలాదిపైగా ఐటెం సాంగ్స్‌లో నటించింది. ‘మూన్‌రామ్ పిరై’ వంటి చిత్రాల్లో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే అనూహ్యంగా 1996లో ఆమె ఆత్మహత్య చేసుకుంది.