Thalapathy Vijay: విజయ్ని కలిసేందుకు చెట్టు మీద నుంచి దూకేసిన వీరాభిమాని.. హీరో ఏం చేశాడో తెలుసా? వీడియో

తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ను చూసేందుకు ఒక అభిమాని తీవ్ర అత్యుత్సాహం ప్రదర్శించాడు. విజయ్ తన రాజకీయ ప్రచారంలో బిజీగా ఉండగా ఆయనను కలవాలన్న కోరికతో ఏకంగా చెట్టుపై నుంచి దూకేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు సదరు అభిమానిపై తీవ్రంగా మండిపడుతున్నారు.

Thalapathy Vijay: విజయ్ని కలిసేందుకు చెట్టు మీద నుంచి దూకేసిన వీరాభిమాని.. హీరో ఏం చేశాడో తెలుసా? వీడియో
Thalapathy Vijay

Updated on: Apr 27, 2025 | 11:37 AM

కోలీవుడ్ నటుడు దళపతి విజయ్ ఇప్పుడు సినిమాల కంటే రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఆయన ఇప్పటికే ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. నటుడిగా ఆయనకు భారీ అభిమానులు ఉండటం వల్ల విజయ్ ఎక్కడికి వెళ్ళినా జనం గుంపులు గుంపులుగా వస్తున్నారు. కొందరైతే తమ అభిమాన హీరోలను కలవాలన్న కోరికత ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటుననారు.
దీనికి తాజా ఉదాహరణ ఈ సంఘటన. విజయ్ ని చూసేందుకు ఒక అభిమాని ఏకంగా చెట్టు మీద నుంచి దూకేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దళపతి విజయ్ శనివారం (ఏప్రిల్ 26) కోయంబత్తూరులో తన పార్టీ తరపున ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఆయన వ్యాన్ పైన నిలబడి ప్రజలకు చేయి అభివాదం చేస్తూ ముందుకు సాగాడు. ఇదే సమయంలో సమయంలో ఒక అభిమాని చెట్టు మీద నుంచి విజయ్ ఉన్న వ్యాన్ పైకి దూకాడు. సదరు అభిమాని ప్రవర్తనకు విజయ్ తో . ఆ తర్వాత సదరు అభిమానికి పార్టీ కండువా కప్పి, శాంతింపజేసి అక్కడి నుంచి పంపించారు విజయ్.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన వారు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. విజయ్ అభిమాని చేసిన ఈ చర్యను కొందరు నెటిజన్లు విమర్శించారు. ‘ఇదేం పిచ్చితనం.. ఈ అభిమానులకు ఏమైనా తెలివి ఉందా? ఇలాంటి మూర్ఖత్వాన్ని అసలు సహించకూడదు’ అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

ఇక సినిమాల విషయానికి వస్తే.. విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘కెవిఎన్ ప్రొడక్షన్స్’ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ తో పాటు పూజా హెగ్డే, బాబీ డియోల్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. అలాగే మమితా బిజు ఓ కీలక పాత్రలో యాక్ట్ చేస్తోంది.

జన నాయగన్ సినిమాలో విజయ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.