Viral Photo: ఈ బుజ్జమ్మ.. ఇప్పుడు ముద్దుగా పాడే కోయిలమ్మ.. అందాల జాబిలమ్మ.. గుర్తించారా..?

ఈ ఫోటోలో ఎంతో క్యూట్‏గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ సింగర్. అందం, గాత్రంతోనే కాకుండా… నవ్వుతో కూడా కట్టిపడేస్తుంది. ఎవరో గుర్తుపట్టండి.

Viral Photo: ఈ బుజ్జమ్మ.. ఇప్పుడు ముద్దుగా పాడే కోయిలమ్మ.. అందాల జాబిలమ్మ.. గుర్తించారా..?
Singer Childhood Photo
Follow us
Ram Naramaneni

|

Updated on: May 05, 2022 | 10:44 AM

Trending photo: సెలబ్రిటీలు తమ లేటెస్ట్ ఫోటోలు పోస్ట్ చేస్తే.. వాటిని వారి ఫ్యాన్స్ నెట్టింట ట్రెండ్ చేస్తారు. తన ప్రేమను లైక్స్, షేర్స్, కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు. అయితే ఇప్పుడంటే చాలా ఎడిట్ ఆప్షన్స్ ఉన్నాయి. ట్రెండ్‌కి తగ్గట్లు డ్రస్సింగ్ సెన్స్ ఉంటుంది. కానీ వారి చిన్నప్పుడు ఎలా ఉండేవారు అనే ఆత్రుత.. అభిమానుల్లో ఉంటుంది. ఎందుకంటే ఆ ఫోటోల్లో వారు చాలా జన్యూన్‌గా ఉంటారు. ఆ సమయంలో ఎక్కువగా ఫోటో స్టూడియోల్లో తీసిన ఫోటోలే ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు తమ చిన్ననాటి ఫోటోలు ట్రెండ్ చేస్తుండటంతో అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ కోవలో పలువురు హీరోలు, హీరోయిన్స్, స్పోర్ట్ స్టార్స్ కూడా ఉన్నారు. తాజాగా అలానే ఓ సింగర్ చిన్ననాటి ఫోటోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఆమె వాయిస్‌కు మాత్రమే కాదు బ్యూటీకి కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. గాత్రంలో మంత్రముగ్ధుల్ని చేయడం మాత్రమే కాదు.. అందంతో మాయాజాలం చేస్తుంది. పాటలకు సంబంధించి గాయణీమణుల్లో మేటి… బ్యూటీలో హీరోయిన్లకు సాటి.. ఏంటండీ.. ఇంత ఇంట్రో ఇచ్చినా కనిపెట్టకపోతే ఎలా…? ఇక మేము చెప్పేస్తాం. ఆ ఫోటోలోని చిన్నారి.. ఇప్పుడు టాప్ సింగర్ గీతా మాధురి.

నచ్చావులే(2008) సినిమాలో ఆమె పాడిన నిన్నే నిన్నే పాటతో ఎంతో ప్రాచుర్యం సంపాదించుకుంది. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూడాల్సిన పరిస్థితి రాలేదు. ప్లే బ్యాక్ సింగర్‌గా ఎన్నో సూపర్ హిట్ పాఠలు పాడింది. లక్షల్లో అభిమానులను సంపాదించుకుంది. ఎన్నో అవార్డులు గెలుచుకుంది. సినిమా పాటలతో పాటు, స్టేజ్ షోలు, రియాలిటీ షోలతో పేరు సంపాదించుకున్న గీతామాధురికి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. గీతా 2014 ఫిబ్రవరి 9న నటుడు నందును పెళ్లి చేసుకొని దాంపత్య జీవతంలోకి అడుగుపెట్టింది. ఈ జంటకు ఓ కుమార్తె(దాక్షాయణి ప్రకృతి) ఉంది. తాజాగా స్వీట్ అండ్ క్యూట్ గీతా మాధురి చిన్ననాటి ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటోను చూసిన చాలామంది ఆమెను పోల్చుకోలేకపోతున్నారు. మీరైనా ముందుగా కనిపెట్టారా..?

Also Read: Hyderabad: ఇంట్లో గోల్డ్ మిస్సింగ్.. విచారణలో బయటపడ్డ కుమార్తె బాగోతం.. మైండ్ బ్లాంక్ అంతే

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!