Hyderabad: ఇంట్లో గోల్డ్ మిస్సింగ్.. విచారణలో బయటపడ్డ కుమార్తె బాగోతం.. మైండ్ బ్లాంక్ అంతే
ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ మాదిరి స్టోరీ.. మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్టులు ఉంటాయ్. పాత్రలు నెక్ట్స్ లెవల్‌లో పండించిన నటీనటులు ఉంటారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం....

Telangana: ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ మాదిరి స్టోరీ.. మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్టులు ఉంటాయ్. పాత్రలు నెక్ట్స్ లెవల్‌లో పండించిన నటీనటులు ఉంటారు. వన్ లైన్‌లో చెప్పాలంటే.. ఇంట్లో గోల్డ్ మిస్సింగ్.. ఎంక్వైరీలో తెలిసిన విషయాలే మిమ్మల్ని స్టన్ అయ్యేలా చేస్తాయి. వివరాల్లోకి వెళ్తే.. గత ఆదివారం రోజున హైదరాబాద్ మూసాపేట్(Moosapet)లో నివాసముంటున్న విజయ్‌కుమార్ అనే వ్యక్తి భార్య.. నగలు కోసం ఇంట్లో ఉన్న బీరువా తెరిచింది. కానీ ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఆమెకు కంగారు వచ్చింది. ఇంట్లో అణువణువూ వెతికింది. అయినా జాడ లేదు. ఏకంగా 24.5 తులాల బంగారం మిస్సైయ్యింది. ఆమెకు టెన్షన్‌తో చెమటలు పడుతున్నాయి. విషయం భర్తకు చెప్పింది. ఇద్దరూ కలిసి వెతికినా.. దొరకలేదు. దీంతో దొంగతనం జరిగిందేమో అని అనుమానించారు. కానీ అందుకు ఛాన్స్ లేదు. ఎందుకంటే అలాంటి ఆనవాళ్లు ఏమీ కనిపించలేదు. ఇంటికి వచ్చిన ఎవరైనా ఈ పని చేసి ఉంటారా..? అని ఆలోచించారు. క్రాస్ చెక్ చేసుకున్నాక.. అలాంటి ఛాన్సే లేదని కన్‌క్లూజన్‌కు వచ్చారు. ఎందుకైనా మంచిదని ఇటీవల కాలంలో ఇంటికి వచ్చింది ఎవరా అని గుర్తు తెచ్చుకున్నారు. ముఖ్యంగా విజయ్‌కుమార్ దంపతులు బయటికి వెళ్లినప్పుడు తమ కుమార్తె ప్రత్యూష(పేరు మార్చాం).. ఒంటరిగా ఇంట్లో ఉండేది. ఆ సమయంలో ఇంటికి ఎవరైనా వచ్చారా..? అని ఆమెని అడిగారు. అలాంటిదేం లేదని చెప్పింది. ఆమె టెన్షన్‌గా కనిపించడంతో.. పేరెంట్స్ ఇంకోసారి గద్దించి అడిగారు. దీంతో ఈసారి ఓపెన్ అయిపోయింది. తన ఫ్రెండ్ 2 సార్లు వచ్చాడని చెప్పింది. దొంగతనం గురించి ఎంక్వైరీ చేస్తే.. కుమార్తె బాగోతం కూడా వెలుగుచూసింది. వెంటనే ఆ దంపతులు కూకట్‌పల్లి(kukatpally) పోలీసులను అప్రోచ్ అయ్యారు. ఇంటికి వచ్చిన కుర్రాడి గురించి ఆరా తీయగా మొత్తం విషయం తెలిసింది.
ప్రత్యూషకు జనవరిలో ఇన్‌స్టాగ్రాంలో సురేష్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన బానోత్ సురేష్.. కూకట్‌పల్లి ఆల్విన్‌కాలనీలో నివాసముంటూ.. స్విగ్గి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ప్రత్యూషతో చాటింగ్ షురూ చేశారు. ప్రొఫైల్‌లో మాంచి ఎడిట్ చేసిన ఫొటో పెట్టటంతో ప్రత్యూష కూడా అట్రాక్ట్ అయ్యింది. అతడితో చాటింగ్ చేయటం షురూ చేసింది. అది కాస్తా పెరిగి కాల్స్ మాట్లాడుకోవటం వరకు వచ్చింది. ఇక కలుసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఏప్రిల్ 20న ఇంట్లో ఎవరు లేని సమయంలో సురేష్‌ను ఇంటికి ఇన్వైట్ చేసింది ప్రత్యూష. ఇంటికి వెళ్లిన సురేష్.. వాళ్ల హౌస్ అంతా కలియతిరిగాడు. కూల్‌డ్రింక్ కావాలని అడగటంతో.. తీసుకొచ్చేందుకు ప్రత్యూష బయటకు వెళ్లింది. ఈ సమయంలో.. ఇంట్లో ఉన్న బీరువాను తెరిచి చూశాడు. దగ దగ మెరుస్తూ బంగారు ఆభరణాలు కనిపించాయి. అంతా తీసుకుంటే అసలుకే మోసం వస్తుందనుకున్నాడో..? ఏమో తెలియదు కానీ సుమారు 6 తులాల వరకు తీసుకుని.. అనుమానం రాకుండా కూర్చున్నాడు. ప్రత్యూష వచ్చిన తర్వాత తనకేం తెలియనట్లు వ్యవహరించాడు. ఆపై ఇంటికి వెళ్లిపోయాడు. అయితే అతడికి ఆశ మరింత పెరిగింది. మిగిలిన బంగారం కూడా కాజేయాలనుకున్నాడు. మరోసారి కలవాలని అడగంతో.. 4న మళ్లీ ఇంటికి పిలిచింది ప్రత్యూష. ఇక ఇప్పుడు కూడా ప్రత్యూషను బయటకు పంపించిన సురేష్.. ఈసారి మొత్తం బంగారాన్ని అంటే.. 18.5 తులాలను నొక్కేశాడు. సురేష్‌ను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా.. తానే దొంగతనం చేసినట్లు అంగీకరించాడు. నిందితుని దగ్గర నుంచి 24.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు కూకట్‌పల్లి పోలీసులు తెలిపారు.