Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: స్వగృహ ప్లాట్స్ అమ్మకానికి సిద్ధం.. ఆసక్తిగలవారు ఎలా ధరఖాస్తు చేసుకోవాలంటే.. పూర్తి వివరాలు మీకోసం

Hyderabad: సొంత ఇంటి కల సామాన్యుల నుంచి ప్రతి ఒక్కరి కల. ఆ కలను నెరవేర్చే దిశగా తెలంగాణ(Telangana) సర్కార్  ముందగుడు వేసింది. తాజాగా హైదరాబాద్ లోని స్వగృహ ఫ్లాట్లు( Swagruha flats)..

Hyderabad: స్వగృహ ప్లాట్స్ అమ్మకానికి సిద్ధం.. ఆసక్తిగలవారు ఎలా ధరఖాస్తు చేసుకోవాలంటే.. పూర్తి వివరాలు మీకోసం
Swagruha Flats
Follow us
Surya Kala

|

Updated on: May 05, 2022 | 8:34 AM

Hyderabad: సొంత ఇంటి కల సామాన్యుల నుంచి ప్రతి ఒక్కరి కల. ఆ కలను నెరవేర్చే దిశగా తెలంగాణ(Telangana) సర్కార్  ముందగుడు వేసింది. తాజాగా హైదరాబాద్ లోని స్వగృహ ఫ్లాట్లు( Swagruha flats) అమ్మకానికి సర్వం సిద్ధం చేస్తోంది. నగరంలోని బండ్ల గూడ, పోచారం స్వగృహ ఫ్లాట్లు యధాస్థితిలో అమ్మకానికి సిద్ధం చేస్తున్నట్లు.. బండ్లగూడలో మొత్తం 1501 ఫ్లాట్లు, పోచారంలో 1470 ప్లాట్లు ఈ వేలం ద్వారా అమ్మనున్నామని .. ఆసక్తిగల వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు ఈ స్వగృహ ఫ్లాట్లు విక్రయంపై బుధవారం సంబంధిత అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఫ్లాట్లు విక్రయ విధివిధానాల తుది రూప కల్పనపై చర్చించారు.

బండ్ల గూడలో మొత్తం 1501 ఫ్లాట్లు విక్రయానికి సిద్దంగా ఉండగా..అందులో వర్క్స్ పూర్తి స్థాయిలో ఉన్నవి 419 ఫ్లాట్లు చ. అడుగు 3వేల రూ.చొప్పున, కొద్దిగా అసంపూర్తిగా ఉన్న 1082 ప్లాట్లు చ.అడుగు 2750 రూ.చొప్పున విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వేముల చెప్పారు. పోచారంలో 1328 ఫ్లాట్లు 2500 రూ.చొప్పున, కొద్ది స్థాయిలో అసంపూర్తిగా ఉన్న 142 ఫ్లాట్లు 2250 రూ. చొప్పున విక్రయించనున్నామని తెలిపారు. ఆసక్తిగల సాధారణ పౌరులు, ఉద్యోగులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

బండ్ల గూడలో 3BHK డీలక్స్ 345 ఫ్లాట్లు, 3BHK 444 ఫ్లాట్లు, 2BHK 712 ప్లాట్లు.. పోచారంలో..3BHK డీలక్స్ 91ఫ్లాట్లు, 3BHK 53 ఫ్లాట్లు, 2BHK 884 ఫ్లాట్లు, 1BHK 442 ఫ్లాట్లు విక్రయానికి సిద్దంగా ఉన్నాయన్నారు.

3BHK డీలక్స్ ఫ్లాట్ లో ఒక హల్, 3బెడ్రూంలు, 3అటాచ్డ్ టాయిలెట్స్, కిచెన్, స్టోర్ రూమ్, పూజ రూమ్, బాల్కనీ సౌకర్యాలుంటాయని చెప్పారు, ఇక BHK ఫ్లాట్లో ఒక హాల్, 3బెడ్రూం, 2 అటాచ్డ్ టాయిలెట్స్, కిచెన్, పూజ రూమ్, బాల్కనీ ఉంటాయి. ఇక 2BHK ఫ్లాట్లో హాల్ విత్ కిచెన్, 2 బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూం, బాల్కనీ ఉంటాయి. ఇక 1BHKఫ్లాట్లు హాల్ విత్ కిచెన్, బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూం, బాల్కనీ ఉంటాయని చెప్పారు.

సాధారణ పౌరులు, ఉద్యోగస్తులు ఆసక్తి కలిగిన వారు మీ సేవా ద్వారా, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.దీనికి సంంధించి ప్రత్యక యాప్ కూడా అందుబాటులోకి రానున్నదని చెప్పారు. అర్హులైన వారికి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందన్నారు.  www.swagruha.telangana.gov.in సైట్ ను పేపర్ నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి 30 రోజుల వరకు విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు ఫీజు వెయ్యి రూపాయలు చెల్లించాలని ఇవి తిరిగి ఇవ్వబడవని తెలిపారు.

ఆసక్తికలిగిన కొనుగోలుదారుల కోసం బండ్లగూడ,పోచారం లో 6చొప్పున మోడల్ హౌస్ లు ఏర్పాటు చేశామని, వాటిని సందర్శించవచ్చన్నారు. ఆసక్తి కలిగిన వారి కోసం అక్కడికక్కడే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. లబ్దిదారుల ఎంపిక లాటరీ పద్ధతిలో ఉంటుందని వెల్లడించారు.అందుకు సంబంధించి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Bride Dress: పెళ్లి వేడుకను స్పెషల్‌గా జరుపుకోవాలనుకున్న యువతి.. ఏకంగా 24 క్యారెట్ల బంగారంతో డ్రెస్

Hyderabad: ఆలస్యంగా నడుస్తున్న ఉద్యోగుల రైలు.. నరకప్రాయంగా మారుతున్న ప్రయాణం