Aha: తెలుగు ఇండియన్ ఐడల్ షోకు ముహూర్తం ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే..
100 % తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ ఇప్పుడు సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ‘ఆహా’.. తన తదుపరి షో తెలుగు ‘ఇండియన్ ఐడల్’ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అత్యుత్తమ సింగింగ్ టాలెంట్ గుర్తించాలనే ఆశయంతో సరికొత్త అడుగు వేసింది.
Aha: 100 % తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ ఇప్పుడు సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ‘ఆహా’… తన తదుపరి షో తెలుగు ‘ఇండియన్ ఐడల్’ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అత్యుత్తమ సింగింగ్ టాలెంట్ గుర్తించాలనే ఆశయంతో సరికొత్త అడుగు వేసింది. అందుకోసం తెలుగు వారిలోని గాత్ర ప్రతిభను వెలికితీయడానికి, సరైన వేదిక కల్పించడానికి ప్రపంచంలోనే అతిపెద్ద పాటల పోటీని తెలుగులోకి తీసుకువస్తోంది. గురువారం ‘ఇండియన్ ఐడల్’ ప్రోమోను విడుదల చేశారు. ఈ కార్యక్రమం కోసం ఆన్ లైన్ ఆడిషన్స్‌ను రీసెంట్‌గా నిర్వహిస్తే ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. వరల్డ్ వైడ్‌గా 5000 ఎంట్రీలు వచ్చాయి.
ఇన్ని ఎంట్రీలు రావడంతో ఇండియన్ ఐడల్‌పై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని సింగింగ్ సెన్సేషన్ శ్రీరామ చంద్ర హోస్ట్ చేస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.థమన్, ప్రముఖ హీరోయిన్, విలక్షణ నటి నిత్యా మీనన్, సింగర్ కార్తీక్ ఇండియన్ ఐడల్ తెలుగుకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.ఈ కార్యక్రమానికి జెప్టో, చందన బ్రదర్స్ సహ సమర్పణలో ఇన్‌స్టాగ్రామ్, తెనాలి డబుల్ హార్స్ కో పవర్డ్‌గా వ్యహరిస్తున్నారు. అలాగే ఫ్రెమెంటల్‌ప్రొడక్షన్ హౌస్, హ్యాపీ మొబైల్స్ స్పెషల్ పార్టనర్‌గా వ్యవహరిస్తున్నారు.
‘ఆహా’ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ విషయానికి వస్తే ..అర్జున ఫల్గుణ, హే జూడ్, ది అమెరికన్ డ్రీమ్, లక్ష్య, సేనాపతి, త్రీ రోజెస్, లాభం, మంచి రోజులొచ్చాయి, రొమాంటిక్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, అనుభవించు రాజా, సర్కార్, ఛెఫ్ మంత్ర, అల్లుడుగారు, క్రిస్‌మస్ తాత వంటివన్నీ ప్రస్తుతం ఆహాలో ప్రేక్షకాదరణ పొందుతున్నవే. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్‌స్టాపబుల్ షోను ఐఎండీబీ నెంబర్ ఒన్ టాక్ షో గా గుర్తించిన విషయం తెలిసిందే.
మరిన్ని ఇక్కడ చదవండి :