AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanghavi: ఓరి బాబోయ్.. సంఘవి ఎలా మారిపోయిందా చూశారా..?

సూర్యవంశంలో మాధవి పాత్ర... సింధూరంలో చేసిన పాత్ర కావొచ్చు.. సంఘవి కెరీర్‌లో టాప్ అని చెప్పాలి. కర్నాటక రాష్ట్రానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ.. తెలుగు ఆమె చక్రం తిప్పారు. ఒకానొక స్టేజ్‌లో.. ఆమె టాప్ ప్లేసులో కొనసాగారు.

Sanghavi: ఓరి బాబోయ్.. సంఘవి ఎలా మారిపోయిందా చూశారా..?
Sanghavi
Ram Naramaneni
|

Updated on: Oct 22, 2024 | 7:06 PM

Share

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్లకు కూడా సమాన ప్రాధాన్యం ఉండేది. సౌందర్య, రమ్యకృష్ణ, రంభ, సంఘవి వంటివారు.. ఎన్నో హిట్ సినిమాల్లో తమ మార్క్ చూపించారు. సంఘవి విషయానికి వస్తే.. 90వ దశకంలో ఓ వెలుగు వెలిగిన నటీమణుల్లో టాప్ లిస్టులో ఉన్నారు. 1993లో వచ్చిన కొక్కోరొకొ అనే తెలుగు సినిమాతో ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ సినిమా అంతగా క్లిక్ అవ్వకపోవడంతో.. తమిళంలో తన ఫేట్ టెస్ట్ చేసుకున్నారు. అక్కడ ఫస్ట్ మూవీలో అజిత్‌ సరసన నటించారు. అమరావతి అనే టైటిల్‌తో వచ్చిన ఈ మూవీ అజిత్‌కి కూడా డెబ్యూ అవ్వడం గమనార్హం. ఆ సినిమా మంచి సక్సెస్ అయింది. ఆ తర్వాత విజయ్ సరసన రసిగన్ చిత్రంలో యాక్ట్ చేసింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్. అలా తమిళంలో తన మార్క్ చూపించి.. వరసగా కన్నడ, తమిళ్ మలయాళంలో సినిమాలు చేసింది. ఆ తర్వాత రెండేళ్లకు శ్రీకాంత్ హీరోగా చేసిన తాజ్‌మహల్ మూవీలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అయింది. దీంతో సంఘవికి మాంచి క్రేజ్ వచ్చింది. ఇక వరసబెట్టి తెలుగు, తమిళ సినిమాల్లో యాక్ట్ చేస్తూ కెరీర్‌లో ముందుకు సాగింది.  నాయుడు గారి కుటుంబం, సరదా బుల్లోడు, ప్రియమైన శ్రీవారు, అబ్బాయి గారి పెళ్లి, పట్టుకోండి చూద్దాం ఇలా వెను వెంటనే తెలుగు సినిమాలు చేసింది.

అయితే.. కృష్ణవంశీ తీసిన సింధూరం సినిమా మాత్రం ఈ అమ్మడి అందాలకు, లుక్స్‌కు కుర్రకారు క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఈ సినిమాతో సంఘవికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత సూర్యవంశంలో మాధవిగా, శివయ్యలో శిరీషగా, ఆహాలో జానకిగా ఇలా.. కలాకాలం నిలిచిపోయే పాత్రలు చేసింది. చివరిగా సంఘవి 2005లో వచ్చిన ఒక్కడే కానీ ఇద్దరు చిత్రంలో నటించింది.

ఇక సంఘవి 2016లో వెంకటేష్ అనే ఐటీ ఎంప్లాయ్‌ని మ్యారేజ్ చేసుకుంది.  బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు 2020లో ఓ పాప జన్మించింది. కర్నాటకకు చెందిన సంఘవి తెలుగులో 38 సినిమాల్లో నటించింది. ఆమె కట్టు, బొట్టు చూసి తెలుగు అమ్మాయనే అనుకుంటారు అందరూ. 2019 నుంచి సినిమాలకు దూరంగా ఉంటోంది సంఘవి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..