Sri Tej: సంధ్య థియేటర్ తొక్కిసలాట.. శ్రీతేజ్‌కు మిషన్ వాత్సల్య స్కీమ్.. నెలకు ఎంత ఇవ్వనున్నారంటే?

గతేడాది సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో చాలా రోజుల పాటు సికింద్రా బాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడడంతో కొన్ని రోజుల క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.

Sri Tej: సంధ్య థియేటర్ తొక్కిసలాట.. శ్రీతేజ్‌కు మిషన్ వాత్సల్య స్కీమ్.. నెలకు ఎంత ఇవ్వనున్నారంటే?
Sri Tej

Updated on: Aug 25, 2025 | 7:12 PM

పుష్ప- 2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా గతేడాది డిసెంబర్‌ 4న సంధ్ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. సుమారు 4 నెలల పాటు ఈ ఆస్పత్రిలోనే ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించారు. ఈ సమయంలో హీరో అల్లు అర్జున్, నిర్మాత అల్లు అరవింద్, డైరెక్టర్ సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలతో పాటు పలువురు సినీ ప్రముఖులు పిల్లాడి మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఆర్థిక సహాయం చేశారు. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడడంతో ఈ ఏడాది ఏప్రిల్ లో పిల్లాడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం శ్రీతేజ్ క్రమంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంటి దగ్గరే అతనికి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే శ్రీతేజ్ కు తెలంగాణ ప్రభుత్వం కూడా అండగా నిలవనుంది. మిషన్ వాత్సల్య పథకం ద్వారా బాధిత కుటుంబానికి మరింత భరోసా ఇచ్చేందుకు సిద్ధమైంది.

 

ఈ మిషన్ వాత్సల్య పథకం కింద శ్రీతేజ సోదరికి ప్రతి నెల రూ.4,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. బాలికకు 18 సంవత్సరాలు నిండేంత వరకు నెలనెలా ఆర్థికసాయం అందుతుంది. మూడు నెలల క్రితం నుంచే ఈ పథకాన్ని ప్రారంభించగా, మొత్తం 12 వేల రూపాయిలు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ఖాతాలో జమ చేసినట్లు తెలుస్తోంది. ఇకపై కూడా నెలనెలా రూ.4 వేల ఆర్థిక సాయం తండ్రి ఖాతాలో జమ కానున్నాయి. ఇక శ్రీతేజ్ విషయానికి వస్తే.. ఈ పిల్లాడికి ఇంకా ట్రీట్ మెంట్ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం అడ్వాన్స్ టెక్నాలజీ సాయంతో శ్రీతేజ్ కు ఫిజియోథెరఫీ ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. గతంతో పోలిస్తే పిల్లాడి పరిస్థితి మెరుగు పడినా, పూర్తిగా కోలుకునేందుకు చాలా రోజులు పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఏంటీ మిషన్ వాత్సల్య?

అనాధలు, వివిధ కారణాలతో ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నా పిల్లలకు అండగా నిలవడమే ఈ పథకం ముఖ్యు ఉద్దేశం. కరోనా కాలంలో  కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాల సహకారంతో 2021లో ఈ పథకాన్ని ప్రారంభించింది.  కేంద్రం 60, ఆయా రాష్ట్రాలు 40 శాతం నిధులు అందిస్తాయి. ఈ పథకంలో భాగంగా  ఎంపిక చేసిన చిన్నారులకు నెలకు రూ.4,000 చొప్పున 18 ఏళ్ళు వచ్చేవరకు ఆర్థిక సాయం అందిస్తారు. ఇప్పుడు శ్రీతేజ్ కు కూడా ఇదే పథకంవర్తించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.