ఆ సీన్‌లో లాజిక్కేది ?? వార్ 2పై RGV షాకింగ్ రివ్యూ
తరచూ తన లాజిక్‌తో అభిమానులను మెస్మరైజ్ చేసి.. వారిచేత చప్పట్లు కొట్టించుకోవటంలో ఆరితేరిన ఆర్జీవీ.. ఇప్పుడు ఉన్నట్టుండి వార్2 మూవీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. వార్ 2 సినిమా పై తనదైన శైలిలో ఓ చిన్న పాటి రివ్యూనిచ్చేశాడు. మూవీలో తాను గమనించిన కొన్ని కీ పాయింట్స్ మీద ఆర్జీవీ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆర్జీవీ.. తాను వార్ 2 సినిమా చూశానని చెప్పాడు. అయితే అందులో హృతిక్ రోషన్ తన ఇంట్రడక్షన్ సీన్‌లోనే కొందరు జపనీస్‌తో ఎందుకు ఫైట్ చేశాడనేది తనకు అర్థం కాలేదన్నాడు. ఇదే అనుమానాన్ని ఆ మూవీకి సంబంధించిన ఓ ముఖ్య వ్యక్తిని అడిగితే.. అతడు షాకింగ్ ఆన్సర్ చెప్పాడంటూ ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. జపనీస్‌తో ఫైటింగ్ పెడితే.. కాస్త కొత్తగా ఉంటుందనే ఉద్దేశంతోనే .. హృతిక్ ఎంట్రీ సీన్‌లో అలా ప్లాన్ చేశామని సదరు వ్యక్తి చెప్పాడని, ఆ మాట విని తాను షాక్ అయ్యానని..నవ్వాలో ఏడవాలో కాసేపు అర్థంకాలేదని ఆర్జీవీ బయటపెట్టాడు. స్పై యూనివర్స్ సినిమాలు అంటే మన దేశపు సీక్రెట్ ఏజెంట్లు.. శత్రుదేశాల వారితో పోరాడతారని అందరూ అనుకుంటారని, కానీ.. ఈ మూవీలో మన మిత్రదేశమైన జపాన్ వాళ్లతో ఫైట్ పెట్టారని గుర్తుచేశాడు. ఇండియాకు జపాన్ ఎప్పుడు శత్రుదేశం అయిందో.. అంటూ ఈ మాత్రం లాజిక్ మూవీ టీం మిస్సయిందంటూ సెటైర్ వేశారు. అంతేకాదు ఇలాంటి సీన్లు వార్ 2 లో చాలా ఉన్నాయని.. అవే కనుక లేకుంటే.. ఈ సినిమా మరో రేంజ్‌కు వెళ్లేదంటూ వార్ 2 సినిమాపై రివ్యూ ఇచ్చేశాడు ఆర్జీవీ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ వయసులోనూ.. జిమ్‌లో తగ్గేదేలే అంటోన్న మెగాస్టార్..!
చిరు ఫ్యాన్ అంటే అట్లుంటది.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న శ్రీకాంత్ ఓదెల ట్వీట్ !
జక్కన్న మెలిక ఇక.. కేమెరాన్ ఒప్పుకోక తప్పదుగా..
పది.. పాతిక కాదు.. లక్షల్లో సంపాదన.. పూసలమ్ముకునే బేబీ నయా దందా…!
బోటు కడిగేందుకు నదిలో దిగిన మహిళ.. నీటిలో కనిపించింది చూసి షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

