AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: అబ్బాయి దగ్గరకు బాబాయ్.. హుటాహుటిన బెంగుళూరు చేరుకున్న బాలకృష్ణ

తీవ్రమైన గుండెపోటుతో ఆస్పత్రిపాలైన నందమూరి తారకరత్న ఆరోగ్య అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లుగా సమాచారం అందుతోంది

Balakrishna: అబ్బాయి దగ్గరకు బాబాయ్.. హుటాహుటిన బెంగుళూరు చేరుకున్న బాలకృష్ణ
Balakrishna
Rajeev Rayala
|

Updated on: Feb 18, 2023 | 4:17 PM

Share

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలుస్తోంది. ఇప్పటికే కుటుంబసభ్యులు బెంగుళూరు చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో తారకరత్న ఆరోగ్యం పరిస్థితిపై డాక్టర్లు బులిటెన్ విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ హుటాహుటిన బెంగుళూరు చేరుకున్నారు. బాలయ్య తో పాటు నందమూరి కుటుంబసభ్యులు కూడా బెంగుళూరుకు పయనమయ్యారు. గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్నకు విదేశీ వైద్యులతో సైతం చికిత్స అందిస్తున్నారు. మధ్యలో కాస్త కోలుకున్నట్లు కనిపించినా.. మళ్లీ అదే పరిస్థితి నెలకొన్నట్లు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో మరికాసేపట్లో సాయంత్రం 4.30 గంటలకు తారకరత్న ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నట్లు వైద్యులు ప్రకటించారు.

నందమూరి తారకరత్న కోలుకోవాలని ఆయన అభిమానులతో పాటు రెండు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో మరికాసేపట్లో ప్రకటించనున్న హెల్త్ బులిటెన్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జనవరి 27న లోకేష్‌ యువగళం పాదయాత్ర ప్రారంభం సందర్భంగా తారకరత్న కూడా హాజరయ్యారు. కుప్పంలో పాదయాత్ర మొదలైన కాసేపటికి ఆయన నడుస్తూనే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కుప్పం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి బెంగళూరు నారాయణ హృదయాలకు తీసుకెళ్లి వైద్యం అందిస్తున్నారు. అయితే రెండ్రోజులుగా ఆయన పరిస్థితి మరింత విషమంగా మారింది.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్