AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikram Chiyaan: విజయ్ దళపతితో సినిమా చేయాలనుకుంటున్నాను.. కానీ ఆ డైరెక్టర్ మాత్రమే .. సంచలన కామెంట్స్ చేసిన విక్రమ్..

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరపుకుంటున్న ఈ మూవీలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మరోవైపు విక్రమ్

Vikram Chiyaan: విజయ్ దళపతితో సినిమా చేయాలనుకుంటున్నాను.. కానీ ఆ డైరెక్టర్ మాత్రమే .. సంచలన కామెంట్స్ చేసిన విక్రమ్..
Vikam
Rajitha Chanti
|

Updated on: Sep 01, 2022 | 9:08 AM

Share

తమిళ్ స్టార్ హీరో విక్రమ్ చియాన్ (Vikram Chiyaan) తాజాగా కోబ్రా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 31న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. అన్ని వర్గాల నుంచి ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఇందులో విక్రమ్ గణిత శాస్త్రవేత్తగా కనిపించగా.. శ్రీనిథి, మీనాక్షి, మృణాళిని కథానాయికలుగా నటించారు. కోబ్రా సినిమాతో మరోసారి విక్రమ్ తన నట విశ్వరూపం చూపించారంటూ టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు రూపొందించి ఈ సినిమా సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. అయితే ఈ మూవీ రిలీజ్ సందర్భంగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించిన విక్రమ్.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే తమిళ్ స్టార్ విజయ్ దళపతితో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పారు.

అంతేకాదు.. విజయ్, తన కాంబోలో రాబోయే చిత్రాన్ని డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాలని తెలిపారు. ఇక ఇదే విషయంపై డైరెక్టర్ అజయ్ స్పందిస్తూ.. వీరిద్దరు కలిసి నటించిన సినిమా చూసేందుకు టికెట్ తీసుకునే మొదటి అభిమాని తానేనంటూ చెప్పుకొచ్చారు. ఇక విక్రమ్ నిర్వహించిన ఈ చిట్ చాట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ డైనమిక్ త్రయం ఒక ప్రాజెక్ట్ కోసం కలిస్తే బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ మీల్ అందుతుంది. ప్రస్తుతం విజయ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వరిసు సినిమా చేస్తున్నాడు. దళపతి మొదటి సారి తెలుగులో నటిస్తోన్న ఇదే కావడం విశేషం. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరపుకుంటున్న ఈ మూవీలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మరోవైపు విక్రమ్ చియాన్.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తోన్న పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటిస్తున్నారు.