Vijayakanth: విజయ్‌కాంత్‌కు కన్నీటి నివాళులు.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు..
71 ఏళ్ల విజయ్‌కాంత్ కొంతకాలంగా అనారోగ్య కారణాలతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. కదలలేని పరిస్థితుల్లో ఉన్న కెప్టెన్ సినిమాలకు ఎప్పుడో దూరం అయ్యారు. ఇక కొన్నాళ్లుగా పార్టీ సమావేశాలకు కూడా దూరంగా ఉంటున్నారు. వీల్ ఛైర్‌కే పరిమితమైన విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థతి మరోసారి విషమించడంతో ఆయనను మంగళవారం చెన్నైలోని మియట్ ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించారు.
మృత్యువుతో పోరాడి ఓడిన కెప్టెన్ విజయ్‌కాంత్‌కు యావత్ తమిళనాడు కన్నీటి నివాళులు అర్పిస్తోంది. ఇవాళ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ అనారోగ్యం కారణంగా గురువారం తుదిశ్వాస విడిచారు. 71 ఏళ్ల విజయ్‌కాంత్ కొంతకాలంగా అనారోగ్య కారణాలతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. కదలలేని పరిస్థితుల్లో ఉన్న కెప్టెన్ సినిమాలకు ఎప్పుడో దూరం అయ్యారు. ఇక కొన్నాళ్లుగా పార్టీ సమావేశాలకు కూడా దూరంగా ఉంటున్నారు. వీల్ ఛైర్‌కే పరిమితమైన విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థతి మరోసారి విషమించడంతో ఆయనను మంగళవారం చెన్నైలోని మియట్ ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. గురువారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.
కెప్టెన్‌గా ఎంతో పేరు తెచ్చుకున్న విజయ్‌కాంత్ 1981లో సినీ రంగ ప్రవేశం చేసి..150కి పైగా చిత్రాల్లో నటించారు. వాటిలో చాలా వరకు హిట్స్ ఉన్నాయి. విజయకాంత్ వందకు పైగా సినిమాల్లో నటించినా, గొప్ప రాజకీయ నాయకుడు అయినా.. ఆయన రియల్ హీరో. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయకాంత్ గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయన పార్థీవదేహాన్ని తన ఇంటి నుంచి కోయంబేడులోని DMDK ఆఫీస్‌కు తరలించారు కుటుంబసభ్యులు. విజయ్‌కాంత్‌ను చివరిసారిగా చూడటానికి ప్రజలు, ఆయన అభిమానులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. తమ అభిమాన నాయకుడు ఇక లేరని జీర్ణించుకోలేక కన్నీరు మున్నీరు అవుతున్నారు.
విజయ్‌కాంత్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ నివాళులు అర్పించారు. విజయ్‌కాంత్ సేవలను కొనియాడారు. ఆయన అంత్యక్రియలను ఇవాళ సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. ఈరోజు సాయంత్రం 4.45 గంటలకు ఆయన డీఎండీకే పార్టీ కార్యాలయంలో విజయ్ కాంత్ అంత్యక్రియలు జరగనున్నాయి. విజయకాంత్ స్వస్థలం మధురై అయినప్పటికీ, చెన్నైలోని ఆయన పార్టీ కార్యాలయంలో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు విజయ్‌కాంత్ మరణంపై సంతాపం తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.