కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే విదాముయార్చి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన అజిత్.. ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే నెల్లైలోని బిఎస్ఎస్ సినిమా అజిత్ సినిమా కోసం ఏర్పాటు చేసిన 285 అడుగుల ఎత్తైన కటౌట్ కుప్పకూలింది. దీంతో అక్కడే ఉన్న అభిమానులు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం 10వ తేదీన విడుదల కానుంది. జి.వి. త్రిష, అర్జున్ దాస్, ప్రసన్న తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే మూవీ టికెట్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. అభిమానులు ప్రీమియర్ వేడుకకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే నెల్లైలోని వాషర్‌మన్‌పేటలోని పిఎస్‌ఎస్ సినిమా హాలులో అజిత్ 285 అడుగుల ఎత్తైన భారీ కటౌట్ ఏర్పాటు చేశారు ఫ్యాన్స్. ఇనుప రాడ్లతో నిర్మించిన ఈ కటౌట్ ఆకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో అక్కడున్న అభిమానులు భయంతో పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.
గతంలో 2019లో సైతం ఇలాంటి ఘటనే జరిగింది. అజిత్ కటౌట్ కు పాలాభిషేకం చేస్తుండగా. కటౌట్ కూలిపోవడంతో ఐదుగురు గాయపడ్డారు. కటౌట్ మీదకు 12 మందికి పైగా ఎక్కడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఇప్పటికే అజిత్ తన అభిమానులను సోషల్ మీడియా వేదికగా చాలా సార్లు రిక్వెస్ట్ చేశారు. తనపై ప్రేమతో ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదని.. ఫ్యాన్ వార్స్ కు దూరంగా ఉండాలని అజిత్ చాలాసార్లు సూచించారు.
Cutout கலாச்சாரத்தை எப்ப தான் விட போறாங்களோ !! 😕
நல்லவேளை எந்தவித அசம்பாவிதமும் நடக்கல 🙏அதுவரையில்👍
— Prakash Mahadevan (@PrakashMahadev) April 6, 2025
ఇవి కూడా చదవండి :