AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aditi Rao Hydari: ఈ సినిమాను మీ అమ్మలతో కలిసి చూడండి.. హైదరాబాదీ హీరోయిన్‌ ఇంట్రెస్టింగ్‌ ట్వీట్

Oke Oka Jeevitham: ప్రామిసింగ్‌ హీరో శర్వానంద్‌ (Sharwanand) హీరోగా, అక్కినేని అమల (Akkineni Amala) కీలక పాత్రలో నటించిన చిత్రం ఒకే ఒక జీవితం. రితూ వర్మ హీరోయిన్‌గా నటించింది. త‌ల్లీకొడుకుల మధ్య ప్రేమానుబంధాలు, టైం ట్రావెల్ నేప‌థ్యంలో శ్రీ‌కార్తీక్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.

Aditi Rao Hydari: ఈ సినిమాను మీ అమ్మలతో కలిసి చూడండి.. హైదరాబాదీ హీరోయిన్‌ ఇంట్రెస్టింగ్‌ ట్వీట్
Aditi Rao Hydari
Basha Shek
|

Updated on: Sep 12, 2022 | 3:16 PM

Share

Oke Oka Jeevitham: ప్రామిసింగ్‌ హీరో శర్వానంద్‌ (Sharwanand) హీరోగా, అక్కినేని అమల (Akkineni Amala) కీలక పాత్రలో నటించిన చిత్రం ఒకే ఒక జీవితం. రితూ వర్మ హీరోయిన్‌గా నటించింది. త‌ల్లీకొడుకుల మధ్య ప్రేమానుబంధాలు, టైం ట్రావెల్ నేప‌థ్యంలో శ్రీ‌కార్తీక్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. అందుకు తగ్గట్లే బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ టాక్‌తో దూసుకెళుతోంది. ఈ సినిమాకు ముందు సుమారు అరడజను ప్లాపులు ఎదుర్కొన్న శర్వాకు ఇది మంచి బ్రేక్‌ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌కు, తల్లీకొడుకుల సెంటిమెంట్‌ను మిళితం చేస్తూ సినిమాను తెరకెక్కించిన విధానం సూపర్బ్‌గా ఉందని సినీ జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. వీటితో పాటు వెన్నెల కిశోర్, ప్రియదర్శిల కామెడీ అద్భుతంగా ఉందంటున్నారు. ఇలా పలువురి ప్రశంసలు అందుకుంటోన్న ఒకే ఒక జీవితం సినిమాపై హైదరాబాదీ హీరోయిన్‌ అదితీ రావ్‌ హైదరీ (Aditi Rao Hydari) స్పందించింది.

‘ నాకు కన్నీళ్లు తెప్పించి..నా హృదయాన్ని నవ్వించినందుకు ధన్యవాదాలు.ఈ విశ్వంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి గురించి ఓ సినిమా తీసినందుకు థ్యాంక్యూ. అమ్మలు నిజంగా ప్రపంచాన్ని ఉత్తమ ప్రదేశంగా మారుస్తారు. మణిహారం లాంటి ఈ సినిమాను మీ అమ్మలను తీసుకెళ్లి చూడండి’ అని ట్విట్టర్లో పేర్కొంది అదితి. కాగా శర్వానంద్‌, అదిరి మహాసముద్రం సినిమాలో జంటగా నటించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us