Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్యలో నాన్నగారిని చూస్తుంటే పండగలా ఉంది’.. చిరు తనయ సుస్మిత కొణిదెల కామెంట్స్..

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన వాల్తేరు వీరయ్య అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మెగా మాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన సుస్మిత కొణిదెల విలేఖరుల సమావేశంలో వాల్తేరు వీరయ్య విశేషాలని పంచుకున్నారు.

Waltair Veerayya: 'వాల్తేరు వీరయ్యలో నాన్నగారిని చూస్తుంటే పండగలా ఉంది'.. చిరు తనయ సుస్మిత కొణిదెల కామెంట్స్..
Sushmita Konidela
Follow us

|

Updated on: Jan 13, 2023 | 7:42 PM

మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత మాస్ అవతారంలో కనిపించి థియేటర్లలో రచ్చ చేశారు. ఆయన ప్రధాన పాత్రలో డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన వాల్తేరు వీరయ్య ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఉదయం నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ సంచలన విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన వాల్తేరు వీరయ్య అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మెగా మాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన సుస్మిత కొణిదెల విలేఖరుల సమావేశంలో వాల్తేరు వీరయ్య విశేషాలని పంచుకున్నారు. ఈ సినిమా కథ విన్నపుడు కొన్ని ఆలోచనలు వచ్చాయని.. దర్శకుడు బాబీ కథ చెబుతున్నపుడు తన ఆలోచనలు చాలా వరకూ మ్యాచ్ అయ్యాయని అన్నారు. అలాగే వాల్తేరు, పోర్ట్ , ఫిషర్ మ్యాన్ అని చెప్పగానే ఒక ఇమాజినేషన్ వచ్చిందని.. బాబీ గారు ముఖ్యంగా చెప్పిన విషయం.. వింటేజ్ చిరంజీవి గారి లుక్ కావాలని… మేము ఆయన్ని ఎలా చూస్తూ పెరిగామో .. అలా వింటేజ్ గ్యాంగ్ లీడర్ .. లాంటి లుక్ కావాలని చెప్పారని అన్నారు.

సుష్మిత మాట్లాడుతూ.. ” నాన్నగారి కాస్ట్యూమ్స్ కోసం ఆయనతో చర్చిస్తాను. ఆయనకి వున్న అనుభవంతో ఒక సీన్ లో ఎలా కనిపించాలో ఆయనకే బాగా తెలుసు. ఇందులో కూడా ఆయన సూచనలు ఇచ్చారు. లుంగీ డిజైన్, ఎక్కడ ఎలాంటి కళ్ళజోడు వుంటే బావుంటుందనే కొన్ని సూచనలు ఇచ్చారు. వింటేజ్ లుక్ తీసుకురావాలి. అలా అని ఇది పిరియడ్ సినిమా కాదు కదా. యవతకు కూడా నచ్చేలా చేయాలి. ఇప్పుడున్న ట్రెండ్స్ పై అవగాహన వుంటుంది. ఇప్పుడున్న ట్రెండ్ ని మిక్స్ చేస్తూ ఆయన నప్పే డిజైన్స్, షర్ట్స్ ప్రత్యేకంగా రూపొందించాం. ఇది నాన్నగారి మోస్ట్ కంఫర్ట్బుల్ జోన్. చూస్తున్నపుడు అద్భుతంగా అనిపించింది. ఒక పెద్ద పండగలా అనిపించింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ కి వెళ్తున్న ప్రతి రోజ పండగలానే వుండేది. ఆయన అభిమానిగా మేము చేసే పనే అది. ఉదయం నాలుగు గంటల కి టీం అందరితో కలసి షోకి వెళ్ళాం. అభిమానులతో పాటు ఈలలు గోలలు అరుచుకుంటూ వచ్చాం. ” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

అలాగే.. డిజైనర్ గా ఉంటూనే నిర్మాణం పై ద్రుష్టి పెట్టారు కదా .. నాన్నగారి సినిమా చేసే ఆలోచనలు ఉన్నాయా ? ప్రశ్నకు స్పందిస్తూ.. ” నాన్నగారు లాంటి స్టార్ తో పని చేయాలనీ అందరి నిర్మాతలకు వుంటుంది. అందరి నిర్మాతలకు చెప్పినట్లే నాకు కూడా ‘’ముందు మంచి కథ తీసుకురా వెంటనే చేద్దాం’’ అంటారు. మేము కూడా ఆ వేటలోనే వున్నాం. నాన్నగారు తన లుక్ ని యాటిట్యూడ్ ని యంగ్ చేసుకుంటూ వచ్చారు. నేను దానిని క్యాచప్ చేశానంతే. అలాగే భోళా శంకర్ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అలాగే రెండు వెబ్ సిరిస్ లపై వర్క్ చేస్తున్నాం.అలాగే ఇంకొన్ని ప్రాజెక్ట్స్ చర్చలు జరుగుతున్నాయి. శ్రీదేవి శోభన్ బాబు సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ” అని తెలిపారు.