Pawan Kalyan-Balakrishna: బాలయ్య షోలో పవన్ ధరించిన బ్లాక్ హుడీ స్పెషాలిటీ ఏంటో తెలుసా..?
రీల్‌లైఫ్ అయినా, రియల్ లైఫ్‌లో అయినా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ స్టైల్ కా బాప్. ఆయన డ్రెస్సింగ్, కాస్ట్యూమ్స్ యూత్‌ను ఇట్టే ఆకర్షిస్తాయి. గతంలో బాలు, గుడుంబా శంకర్ తదితర సినిమాల్లో పవన్ ధరించిన స్టైలిష్ కాస్ట్యూమ్స్ ఎంత సెన్సేషన్ సృష్టించాయో
రీల్‌లైఫ్ అయినా, రియల్ లైఫ్‌లో అయినా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ స్టైల్ కా బాప్. ఆయన డ్రెస్సింగ్, కాస్ట్యూమ్స్ యూత్‌ను ఇట్టే ఆకర్షిస్తాయి. గతంలో బాలు, గుడుంబా శంకర్ తదితర సినిమాల్లో పవన్ ధరించిన స్టైలిష్ కాస్ట్యూమ్స్ ఎంత సెన్సేషన్ సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ అదే స్టైల్‌ను మెయింటైన్ చేస్తున్న ఆయన మరోసారి తన ఫ్యాషన్ సెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్‌స్టాపబుల్ షోలో పవర్ వేసుకొచ్చిన స్టైలిష్ బ్లాక్ హుడీ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. సోషల్ మీడియాలో అందరూ ఈ డ్రెస్ గురించే మాట్లాడుకుంటున్నారు. బ్లాక్ హుడీ కోసం పవన్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో కూడా గట్టిగానే సెర్చ్ చేస్తున్నారు. కంపెనీ, ధర వివరాలను తెలుసుకునేందుకు సామాజిక మాధ్యమాల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఉన్న వివరాలను బట్టి ఈ బ్లాక్ హుడీ హ్యూగో బాస్ కంపెనీకి చెందినదని తెలుస్తోంది. దీని ధర విదేశీ కరెన్సీ లో ధర 245 డాలర్లుగా ఉంటుందట. ఇక మన ఇండియన్ కరెన్సీలో 20 వేల నుంచి 27 వేల రూపాయల మధ్యలో ఉంటుందట. ఇక బాలయ్య షోలో పవన్ కల్యాణ్ ఎపిసోడ్ కోసం అటు బాలయ్య ఫ్యాన్స్, ఇటు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇందుకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ఇప్పటికే విడుదలైన ఫొటోలు, ప్రొమోలు ఓ రేంజ్‌లో సెన్సేషన్ సృష్టించాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
ఆ రైతు గొప్ప ఆలోచన.. వారికి ఒక కొత్త జీవితాన్నిచ్చింది..
కుక్క కోసం రూ. 15 లక్షలు.. ఖర్చు చేసారు.. చివరికి..
గడ్డకట్టిన నయాగరా ఫాల్స్.. వింటర్ వండర్‌ను చూసారా ??
ప్రమాదకర ఎయిర్ పోర్ట్‌లు ఇవే.. ల్యాండింగ్ కత్తి మీద సామే
మళ్లీ బతకాలన్న ఆశతో.. భద్రపరుస్తున్న మృత దేహాలు
బంగారం, వెండిధరల ఎఫెక్ట్.. రెచ్చిపోయిన దొంగలు
వీడి ట్యాలెంట్‌కి హ్యాట్సాఫ్.. 15 సెకెండ్లలోనే మాయం చేస్తాడు..

