AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్ సూసైడ్: అస‌లేం జ‌రిగింది….

బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ సూసైడ్ ఒక్క‌సారిగా సినీ ప్ర‌పంచాన్ని దిగ్భంతికి గురిచేసింది. త‌క్కువ వ‌య‌సులోనే, మంచి ఫేమ్ తో ఉన్న స‌మ‌యంలో అత‌డు ఇలా ఎందుకు చేశాడ‌న్న‌ది ఇప్పుడు మిస్ట‌రీగా మారింది. ఈ నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సుశాంత్ సూసైడ్: అస‌లేం జ‌రిగింది....
Ram Naramaneni
|

Updated on: Jun 14, 2020 | 9:57 PM

Share

బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ సూసైడ్ ఒక్క‌సారిగా సినీ ప్ర‌పంచాన్ని దిగ్భంతికి గురిచేసింది. త‌క్కువ వ‌య‌సులోనే, మంచి ఫేమ్ తో ఉన్న స‌మ‌యంలో అత‌డు ఇలా ఎందుకు చేశాడ‌న్న‌ది ఇప్పుడు మిస్ట‌రీగా మారింది. ఈ నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గత ఆరు నెలలుగా మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న సుశాంత్‌.. అందువ‌ల్లే ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉండొచ్చ‌ని అనుమానాలు వ్యక్త‌మ‌వుతున్నాయి.

సూసైడ్ విష‌యం తెలిసిన వెంటనే సుశాంత్‌ ఫ్లాట్‌కు చేరుకున్న పోలీసులు అక్క‌డ అభించిన అన్ని ఆధారాలను సేక‌రించారు. ఇప్పటివరకూ సూసైడ్‌ నోట్‌ లభించలేదు. అయితే కొన్ని మెడిసన్స్‌ను మాత్రం గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం సుశాంత్‌ మృతిపై ఓ క్లారిటీ రానుంది. ఈ నేపథ్యంలో ఆయన బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను కూడా ప‌రిశీలించారు. సుశాంత్‌ ఇటీవలే బాంద్రాలోని ఓ ఫ్లాట్‌కు మారారు. దానికి నెలకు రూ.4.5 లక్షల రెంట్ క‌డుతున్నారు. సుశాంత్ మృతిపై తమకు ఎలాంటి అనుమానాలూ లేవని ఆయన ఫ్రెండ్స్, స‌న్నిహితులు చెబ‌తున్న‌ట్లు సమాచారం. మార్నింగ్ జ్యూస్‌ తాగి బెడ్‌రూంలోకి వెళ్లిన‌ సుశాంత్‌.. ఎంతకీ బ‌య‌టకు రాకపోవడంతో ఆ ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి అతడి మిత్రుల‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు తలుపు బ‌ద్ద‌లుకొట్టి చూడగా, బెడ్‌షీట్‌ సాయంతో సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ సుశాంత్‌ కనిపించాడు. దీంతో వెంటనే వాళ్లు పోలీసులకు స‌మాచారం అందించారు.

సుశాంత్‌ గత రాత్రి ఓ టీవీ నటుడికి కాల్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే అవతలి వ్యక్తి ఆ కాల్ ఆన్స‌ర్ చెయ్య‌లేదు. కాగా, ఈ రోజు ఉదయం 9.30 సమయంలో సుశాంత్‌ తన సోదరితో మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. అయితే, గతవారం సుశాంత్‌ మేనేజర్‌ దిశా కూడా సూసైడ్ చేసుకున్న నేప‌థ్యంలో ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ జ‌రుపుతున్నారు.

హెల్ప్ కోసం బాలకృష్ణకు మెసేజ్ చేస్తే.. నాతో ఆయన ఫోన్ చేసి..
హెల్ప్ కోసం బాలకృష్ణకు మెసేజ్ చేస్తే.. నాతో ఆయన ఫోన్ చేసి..
మళ్లీ థియేటర్లలోకి 'పుష్ప 2'.. ప్రమోషన్స్‌లో బన్నీ ఫ్యామిలీ
మళ్లీ థియేటర్లలోకి 'పుష్ప 2'.. ప్రమోషన్స్‌లో బన్నీ ఫ్యామిలీ
రాఖీ మూవీలో ఆ క్యారెక్టర్ చేసినందుకు ఇంటికి వచ్చి మరీ..
రాఖీ మూవీలో ఆ క్యారెక్టర్ చేసినందుకు ఇంటికి వచ్చి మరీ..
డిమార్ట్‌లో సరుకుల రేట్స్ ఎందుకు అంత తక్కువగా ఉంటాయి?
డిమార్ట్‌లో సరుకుల రేట్స్ ఎందుకు అంత తక్కువగా ఉంటాయి?
చనిపోయిందనుకున్న అమ్మాయి.. ఆరు నెలలకు ప్రత్యక్షం..!
చనిపోయిందనుకున్న అమ్మాయి.. ఆరు నెలలకు ప్రత్యక్షం..!
రోజూ ఈ ఒక్క జ్యూస్ తాగారంటే..! మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం..
రోజూ ఈ ఒక్క జ్యూస్ తాగారంటే..! మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం..
అమెరికా టారిఫ్‌ బాంబు.. భారత్‌, చైనా దారెటు?
అమెరికా టారిఫ్‌ బాంబు.. భారత్‌, చైనా దారెటు?
వాట్సప్‌లో బెజవాడ దుర్గమ్మ దర్శనం టికెట్లు బుక్ చేస్కోండిలా..
వాట్సప్‌లో బెజవాడ దుర్గమ్మ దర్శనం టికెట్లు బుక్ చేస్కోండిలా..
ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన మొదటి సినిమా.. కట్ చేస్తే డిజాస్టర్..
ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన మొదటి సినిమా.. కట్ చేస్తే డిజాస్టర్..
గోల్డ్‌ లోన్‌ వర్సెస్‌ పర్సనల్‌ లోన్‌..! ఏది తీసుకుంటే మంచిది?
గోల్డ్‌ లోన్‌ వర్సెస్‌ పర్సనల్‌ లోన్‌..! ఏది తీసుకుంటే మంచిది?