సుశాంత్ ఆత్మహత్య..సల్మాన్ ఖాన్ సంచలన ట్వీట్..
సుశాంత్ ఆత్మహత్య హిందీ చిత్ర పరిశ్రమలో పెను ప్రకపంనలు రేపుతోంది. బాలీవుడ్ నెపోటిజంపై పలువురు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులే కొందరు పరిశ్రమ పెద్దలపై దుమ్మెత్తి పోస్తున్నారు. తాము కూడా బెదిరింపులు, ఒత్తిళ్లు ఎదుర్కొన్నామని బాహాటంగానే చెబుతున్నారు.

సుశాంత్ ఆత్మహత్య హిందీ చిత్ర పరిశ్రమలో పెను ప్రకపంనలు రేపుతోంది. బాలీవుడ్ నెపోటిజంపై పలువురు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులే కొందరు పరిశ్రమ పెద్దలపై దుమ్మెత్తి పోస్తున్నారు. తాము కూడా బెదిరింపులు, ఒత్తిళ్లు ఎదుర్కొన్నామని బాహాటంగానే చెబుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ లోని పలువురు అగ్రతారలు, ప్రొడ్యూసర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. కుటుంబ లెగసీతో పైకి వచ్చిన పలువురి సోషల్ మీడియా ఖాతాలను నెటిజన్లు ఆన్ ఫాలో చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ప్రత్యక్ష ఆందోళనలు జరుతున్నాయి. పాట్నాకు చెందిన జన్ అధికార్ స్టూడెంట్ యూనియన్ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపింది. సిటీలోని కార్గిల్ చౌక్‌వద్ద బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, నిర్మాత కరణ్ జోహార్ దిష్టిబొమ్మలను తగలబెట్టారు. పలువురు సినీ ప్రముఖుల అమానుష చర్యల వల్లే సుశాంత్‌కు కెరీర్ నాశనమైందని వారు ఆరోపించారు. ఇంకొందరు సుశాంత్ చావుకు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలంటూ న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తున్నారు.
ఈ క్రమంలో బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ సుశాంత్ ఆత్మహత్యపై స్పందించారు. ఈ సమయంలో తన ఫ్యాన్స్ అందరూ..సుశాంత్ అభిమానులకు మద్దతు నిలబడాలని కోరారు. ఒకరినొకరు దూషించుకోవడం, శాపనార్థాలు పెట్టుకోవడం కరెక్ట్ కాదని సూచించారు. సందర్భం వెనుక ఉన్న భావోద్వేగాన్ని అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రేమించేవారిని కొల్పోవడం ఎంతో బాధకరమైన విషయమని..సుశాంత్ కుటుంబ సభ్యులు, అభిమానులకు అండంగా ఉండమని తన ఫ్యాన్స్ ను అభ్యర్థించారు సల్మాన్ ఖాన్.
A request to all my fans to stand with sushant’s fans n not to go by the language n the curses used but to go with the emotion behind it. Pls support n stand by his family n fans as the loss of a loved one is extremely painful.
— Salman Khan (@BeingSalmanKhan) June 20, 2020




