సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ స్ట్రీమింగ్ వాయిదా..

సూర్య తాజాగా  'ఆకాశం నీ హద్దురా'.. త‌మిళంలో 'సూరారై పొట్రు' అనే సినిమాలో నటించారు. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి లైఫ్ స్టోరీ ఆధారంగా మహిళా దర్శకురాలు సుధా కొంగర ఈ మూవీని డైరెక్ట్ చేశారు.

సూర్య 'ఆకాశం నీ హద్దురా' స్ట్రీమింగ్ వాయిదా..
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 23, 2020 | 5:03 PM

సూర్య తాజాగా  ‘ఆకాశం నీ హద్దురా’.. త‌మిళంలో ‘సూరారై పొట్రు’ అనే సినిమాలో నటించారు. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి లైఫ్ స్టోరీ ఆధారంగా మహిళా దర్శకురాలు సుధా కొంగర ఈ మూవీని డైరెక్ట్ చేశారు. సూర్య నిర్మిస్తూ నటించిన ఈ సినిమాలో అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా ఆడిపాడనుంది. విలక్షణ నటుడు మోహన్ బాబు కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారు. మే 1న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కోవిడ్ వ్యాప్తి కారణంగా అనుకున్నది జరగలేదు. దీంతో అన్ని సినిమాల మాదిరిగానే ఈ చిత్రాన్ని ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ ప్రీమియర్ గా విడుదల చేయడానికి నిర్ణయించారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 30 వ తారీఖున స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. కానీ అనుకోని విధంగా పోస్ట్‌పోన్ అయ్యింది. ఈ విషయాన్ని సూర్య ట్విట్టర్‌ ద్వారా స్వయంగా వెల్లడించారు.  ఈ సినిమా విమానయాన రంగానికి చెందిన థీమ్ కావడంతో యూనిట్ నిజమైన ఎయిర్ ఫోర్స్ లొకేషన్లలో, నిజమైన విమానాలతో షూటింగ్ చేశారు. ఈ చిత్రీకరణ కోసం విమానయాన రంగం నుండి, దేశ భద్రతా విభాగం నుండి అనేక అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది. అయితే విడుదలకు కూడా విమానయాన శాఖ నుండి కొన్ని ఎన్ఓసీలు రావాల్సి ఉందట. అవి ఆలస్యమయ్యేలా ఉండటంతో 30వ తేదీన రిలీజ్ చెయ్యట్లేదని, వాయిదా వేస్తున్నామని..సూర్య లేఖ ద్వారా తెలిపారు. ఇక కొత్త రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. ఈ సినిమాలో సూర్య పాత్రకు టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ డబ్బింగ్ చెప్పారు.

Also Read : 

(టాలీవుడ్ హీరోతో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన నిధి! )

( మళ్లీ వస్తోన్న పబ్‌జీ, పేరెంట్స్ గుండెల్లో గుబులు ! )

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
వావ్.. ఆటోవాలా ఐడియా అదుర్స్..!
వావ్.. ఆటోవాలా ఐడియా అదుర్స్..!
కొత్త ఏడాదిలో పసిడి ధరలు.. తగ్గుతాయా ?? పెరుగుతాయా ??
కొత్త ఏడాదిలో పసిడి ధరలు.. తగ్గుతాయా ?? పెరుగుతాయా ??