టాలీవుడ్ హీరోతో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన నిధి!

హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ `సవ్యసాచి` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అక్కినేని అఖిల్ సరసన 'మిస్టర్ మజ్ను' సినిమాలో  హీరోయిన్‌గా నటించింది.

టాలీవుడ్ హీరోతో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన నిధి!
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 23, 2020 | 3:53 PM

హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ `సవ్యసాచి` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అక్కినేని అఖిల్ సరసన ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో  హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ రెండు సినిమాలు ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. ఆ తర్వాత పూరి జగన్నాథ్-రామ్ కాంబినేషన్‌లో వచ్చిన`ఇస్మార్ట్ శంకర్` సినిమాలో నటించి బ్లాక్‌బాస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే నిధి అగర్వాల్ డేటింగ్ రూమర్స్ కూడా ఆమెను వార్తల్లో వ్యక్తిగా చేస్తున్నాయి. గతంలో క్రికెటర్, ప్రస్తుత ఐపీఎల్‌ పంజాబ్ జట్టు కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తామిద్దరం ఎప్పట్నుంచో ఫ్రెండ్స్ అని..అందుకే కలిశామని..అంతకుమించి ఏమీ లేదని నిధి క్లారిటీ ఇచ్చింది.

కాగా  నిధి ప్రస్తుతం ఓ టాలీవుడ్ హీరోతో డేటింగ్‌ చేస్తోందని మళ్లీ వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన నిధి ఆ వార్తలపై స్పందించింది. తానెవరితోనూ డేటింగ్ చేయడం లేదని తెలిసింది. ప్రస్తుతానికి తాను సింగిల్‌గానే ఉన్నానంటూ స్పష్టత ఇచ్చింది.

Also Read :

(హెడ్‌మాస్టార్ దారితప్పడు..సర్టిఫికేట్ కోసం లంచం )

( కృష్ణా జిల్లాలో విషాదం, కరెంట్ షాక్‌తో ఇద్దరు కూలీలు మృతి )