Nagarjuna: నాగార్జున, అమల లవ్‌స్టోరీ టాప్ సీక్రెట్ ఇదే.. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారంటే.?

అమల అక్కినేనితో తనకున్న రిలేషన్‌ను, ఆమె ఇండస్ట్రీ అరంగేట్రం, నాగార్జునతో లవ్ స్టోరీ అంశాలపై కీలక విషయాలను పంచుకున్నారు సురేష్ చక్రవర్తి. అమల తన సొంత చెల్లి కాదని, అయితే ఆమెకు తానే మేనేజర్‌గా వ్యవహరించానని తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి.

Nagarjuna: నాగార్జున, అమల లవ్‌స్టోరీ టాప్ సీక్రెట్ ఇదే.. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారంటే.?
Nagarjuna Amala

Updated on: Jan 18, 2026 | 12:20 PM

నటుడు సురేష్ చక్రవర్తి తన ఇంటర్వ్యూలో కీలక విషయాలను పంచుకున్నారు. నటి అమల అక్కినేనితో తనకున్న అనుబంధం, ఆమె అరంగేట్రం, నాగార్జునతో లవ్ స్టోరీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సురేష్ చక్రవర్తి అమల అక్కినేనికి సొంత అన్నయ్య కానప్పటికీ, ఇండస్ట్రీలో ఆమెకు అన్నయ్యగా, మేనేజర్‌గా ఉండేవారు. ఆమెను తన సొంత చెల్లెలిగా భావించానని.. ఐదారు సంవత్సరాల పాటు ఒకే ఇంట్లో కలిసి జీవించామని చెప్పారు. ఇక అమల సినీ అరంగేట్రం గురించి మాట్లాడుతూ.. దర్శకుడు టి. రాజేందర్ తన సినిమా కోసం ఒక నటి కోసం చూస్తున్నప్పుడు.. తానే అమలను సిఫార్సు చేశానన్నారు. మొదట నటించడానికి అమల ఆసక్తి చూపించాడు. కానీ తానే ఆమెను ఒప్పించాను. ఒకసారి అమల షూటింగ్‌కు రాలేనని టెలిగ్రామ్ పంపింది.

ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో

ఆ సమయంలో ఆమె మనసు మార్చేందుకు దర్శకుడు రాజేందర్ తన సాయం కోరారని సురేష్ అనంరు. ఇక అప్పుడే తన స్నేహితుడు జగపతిబాబు సహాయంతో విశాఖపట్నంలో అమల ఎక్కడుందో కనిపెట్టాం. అమల రోడ్డు పక్కన ఒక కుక్కకు ఫుడ్ తినిపిస్తూ కనిపించింది. ఆమె జంతువుల పట్ల చూపించే ప్రేమను అప్పుడే అర్ధం చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా.. ఆమె అలానే ఉంది. ఎంత పేరు, ప్రతిష్టలు పెరిగినా.. సామాన్యంగా తన జీవితాన్ని సాగిస్తోందని అమల సింప్లిసిటీని పొగిడారు సురేష్.

ఇవి కూడా చదవండి

అమల ఓ ఇంట్రోవర్ట్. తన మనసులోని మాటను ఎక్కువగా బయటపెట్టదు. నాగార్జున, అమల లవ్ స్టోరీ గురించి తనకు ముందుగా తెలియదు. నాగార్జుననే అమలకు మొదట ప్రపోజ్ చేసి ఉంటారని తాను భావిస్తున్నానని సురేష్ అన్నారు. అమల సింప్లిసిటీ, డౌన్ టు ఎర్త్ స్వభావం, డబ్బుపై ఆసక్తి లేకపోవడం, జంతువుల పట్ల ప్రేమ లాంటి లక్షణాలతోనే నాగార్జున ఆమెను ఇష్టపడి ఉంటారని సురేష్ తెలిపారు. అక్కినేని కుటుంబంలోకి వెళ్ళిన తర్వాత కూడా.. అమలతో తనకున్న బంధం కొనసాగుతోందని.. తాను కెరీర్‌ పరంగా బిజీ కావడం, ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్ళడం వల్ల తరచుగా కలవడం కుదరట్లేదని వివరించారు.

ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..