Rajinikanth : రజినీకాంత్ హెల్త్ అప్డేట్.. ఎప్పుడు డిశ్చార్జ్ కానున్నారంటే..
ప్రస్తుతం రజినీకాంత్ రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తలైవా.. ఇప్పుడు వేట్టయాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.ఈ చిత్రానికి టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 10న అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు.
దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. సెప్టెంబర్ 30న ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేసి గుండెలో స్టెంట్ వేశారు. ప్రస్తుతం రజినీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. గురువారం రజినీ డిశ్చార్జ్ కావాల్సి ఉండగా.. వైద్యుల సూచన మేరకు మరో రోజు అబ్జర్వేషన్ లో ఉంచినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. శుక్రవారం తలైవాను డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
రజినీకాంత్ గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడింది. ఇందుకు ట్రాన్స్ కాథెటర్ పద్దతి ద్వారా వైద్యులు చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. ఈరోజు రజినీని అబర్జ్వేషన్ లో ఉంచిన డాక్టర్స్ రేపు (శుక్రవారం) డిశ్చార్జ్ చేయనున్నారట. రజినీ ఆసుపత్రిలో చేరినట్లు తెలియగానే అటు అభిమానులతోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, హీరో కమల్ హాసన్, విజయ్ దళపతి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ రజినీ త్వరగా ఇంటికి తిరిగి రావాలని కోరుకున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం రజినీకాంత్ రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తలైవా.. ఇప్పుడు వేట్టయాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.ఈ చిత్రానికి టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో మలయాళీ హీరోయిన్ మంజు వారియర్ కథానాయికగా.. అమితాబ్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. చాలా కాలం తర్వాత రజినీ, అమితాబ్ కలిసి నటిస్తుండడంతో ఈ మూవీపై మంచి హైప్ నెలకొంది. ఈ సినిమాను అక్టోబర్ 10న అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. అలాగే డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.