sunishith: ఈ సారి తారక్ గురించి ఇష్టమొచ్చినట్టు వాగిన సునిషిత్.. నీకు చావే అంటున్నారు అభిమానులు.
కొంతమంది మాత్రం ఇంకా పిచ్చి పిచ్చి పనులు, నోటికొచ్చిన కామెంట్స్ చేస్తూ రోజూ వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిలో సునిషిత్ ఒకడు. ఈ వింత మనిషి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ హీరో నా ఫ్రెండు.. పలనా హీరోయిన్ నా గర్ల్ ఫ్రెండు అంటూ నోటికూచినట్టు వాగుతూ ఉంటాడు.

ఈ మధ్య కాలంలో ఎవరు..? ఎందుకు..? ఫెమస్ అవుతున్నారో తెలియడం లేదు. సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ చాలా మంది తమను తాము సోషల్ మీడియా స్టార్స్ గా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. నిజంగా టాలెంట్ ఉన్న వాళ్లకు మంచి అవకాశాలు దొరుకుతున్నాయి కానీ కొంతమంది మాత్రం ఇంకా పిచ్చి పిచ్చి పనులు, నోటికొచ్చిన కామెంట్స్ చేస్తూ రోజూ వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిలో సునిషిత్ ఒకడు. ఈ వింత మనిషి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ హీరో నా ఫ్రెండు.. పలనా హీరోయిన్ నా గర్ల్ ఫ్రెండు అంటూ నోటికూచినట్టు వాగుతూ ఉంటాడు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ గురించి కామెంట్స్ చేసి ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం అయ్యాడు. అప్పట్లో ఓ స్టార్ హీరోయిన్ తనతో డేటింగ్ చేసిందని కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యాడు.
ఇక రీసెంట్ గా మెగా పవార్ స్టార్ సతీమణి పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దాంతో మెగా ఫ్యాన్స్ మనోడికి గట్టిగానే బుద్ది చెప్పారు. మెగా ఫ్యాన్స్ అంటే మాములుగా ఉంటుందా..? సునిషిత్ ను చితకొట్టుడు కొట్టారు. అయినా ఈ హీరో కానీ హీరో గారిగి బుద్ది రాలేదు. ఈసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పెట్టుకున్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు ఇతగాడు. ఎన్టీఆర్ గురించి తప్పు తప్పుగా మాట్లాడాడు. సునిషిత్ తారక్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. దాంతో తారక్ ఫ్యాన్స్ మనోడి పై పీకల్లోతు కోపంతో ఊగిపోతున్నారు. దొరికితే నీకు చావే అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. సునిషిత్ నోరు మూయించాల్సిందే అంటున్నారు ఇతర హీరోల అభిమానులు.
