Sudigali Sudheer: ఇన్ స్టాలో సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క వ్యక్తి ఎవరో తెల్సా..? మీ గెస్ కరెక్టేనా..?

బుల్లితెరపై కామెడీ, వెండితెరపై యాక్షన్ ఇలా రెండింటిని బ్యాలెన్స్‌ చేస్తూ తెలుగు ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు సుడిగాలి సుధీర్. మెజిషియన్‌ నుంచి జబర్దస్థ్‌లో కంటెస్టెంట్‌గా ప్రయాణం మొదలు పెట్టిన సుధీర్‌ అనతికాలంలోనే స్టార్‌గా ఎదిగాడు.

Sudigali Sudheer: ఇన్ స్టాలో సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క వ్యక్తి ఎవరో తెల్సా..? మీ గెస్ కరెక్టేనా..?
Sudigali Sudheer
Follow us
Ram Naramaneni

|

Updated on: May 26, 2023 | 4:32 PM

‘జబర్దస్త్’ షో ద్వారా విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న వ్యక్తి ఎవరంటే.. సుడిగాలి సుధీర్. అంతకుముందు చిన్న.. చిన్న మ్యాజిక్‌లు చేసే సుధీర్.. ఈ షోతో స్టార్‌గా అవతరించాడు. అతడికి ఓ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆ తర్వాతి కాలంలో సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేశాడు. పాపులారిటీ పెరగడంతో హీరోగానూ ఫేట్ టెస్ట్ చేసుకున్నాడు. అయితే మొదట అపజయాలే ఎదురయ్యాయి. గాలోడు చిత్రంలో ఓ మీడియం హిట్ అందుకున్నాడు. దీంతో ఆచితూచి అడుగులు వేస్తున్న సుధీర్.. తన నాలుగవ సినిమాను ఇటీవలే లాంచ్ చేశాడు. ‘పాగల్’  మూవీ తీసిన దర్శకుడు నరేష్ కుప్పిలి డైరక్షన్‌లో ‘GOAT- గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్’ అనే సినిమా చేస్తున్నాడు. సుధీర్ సరసన దివ్య భారతి హీరోయిన్‌గా నటిస్తుంది.

ఇక సుధీర్‌ను యూట్యూబ్‌ స్టార్ అని అతని ఫ్రెండ్స్ ఆట పట్టిస్తూ ఉంటారు. యూట్యూబ్‌లోని అన్ని వీడియోలు కింద సుధీర్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. అందుకే అతడితో అలా కామెడీ చేస్తారు ఇతర ‘జబర్దస్త్’ కమెడియన్స్. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌ ఫాలోయింగ్‌ ఉంది ఈ సుడిగాలి సుధీర్‌కు. అతడిని ఇన్ స్టాలో 1.3 మిలియన్ల మంది ఫాలో అవతున్నారు. కానీ సుధీర్ మాత్రం కేవలం ఒక్కరినే ఫాలో అవుతున్నారు. ఆ వ్యక్తి ఎవరో మీరు గెస్ చేయగలరా..? చాలామంది థింక్ చేస్తున్నట్లు రష్మీ అయితే కాదు. ఇక ఎక్కువ వెయిట్ చెయ్యంలేండి. మేమే చెప్పేస్తాం.

సుధీర్ ఫాలో అవుతున్న ఆ వ్యక్తి.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. చిరును స్పూర్తిగా తీసుకుని ఎంతో మంది.. ఇండస్ట్రీకి వచ్చారు. రకరకాల క్రాఫ్ట్స్‌లో సత్తా చాటుతున్నారు. అలానే సుధీర్‌కు చిరూనే ఇన్‌స్పిరేషన్. ఇదే విషయాన్ని పలు వేదికలపై కూడా చెప్పుకొచ్చాడు సుధీర్. ఇక ఇన్ స్టాలో తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఉన్న ఫోటోలతో పాటు తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ షేర్ చేస్తూ ఉంటారు సుధీర్.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.