Harom Hara Release Teaser: హరోంహర రిలీజ్ టీజర్ చూశారా..? ఇక సెప్పెదేం లేదు..

టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ చిత్రం హరోంహర. ది రివోల్డ్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్‏కు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సుధీర్ జోడిగా మాళవికా శర్మ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న

Harom Hara Release Teaser: హరోంహర రిలీజ్ టీజర్ చూశారా..? ఇక సెప్పెదేం లేదు..
Haromhara Teaser

Updated on: Jun 13, 2024 | 4:46 PM

టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ చిత్రం హరోంహర. ది రివోల్డ్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్‏కు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సుధీర్ జోడిగా మాళవికా శర్మ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీని జూన్ 14న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. హీరో, దర్శకుడితోపాటు చిత్రయూనిట్ విడివిడిగా ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్ ఆకట్టుకున్నాయి. కానీ ఇప్పుడు విడుదలకు ఒక్కరోజు ముందు ఈ సినిమా నుంచి స్పెషల్ టీజర్ రిలీజ్ చేసింది మూవీ టీం.

సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు దాదాపు 44 సెకన్ల నిడివిగల ఓ వీడియోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అందులో కనిపించిన యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నాయి. 1989నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తువ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక ఇందులో సుధీర్ బాబు కుప్పం యాసలో అలరించనున్నట్లు తెలుస్తోంది. చివర్లో ఇక సెప్పెదేం లేదు.. సేసేదే అంటూ సుధీర్ చెప్పే డైలాగ్ హైలెట్ గా నిలిచింది. ఈ మూవీని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

ట్రైలర్, టీజర్ తో విడుదలకు ముందే ఆసక్తిని కలిగించిన ఈ సినిమా కోసం సుధీర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో సునీల్ రవికాలే, కేజీఎఫ్ ఫేమ్ లక్కీ లక్ష్మణ్, అర్జున్ గోవిందా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా రేపు అడియన్స్ ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us