- Telugu News Photo Gallery Cinema photos Do You Know About India's Highest Paid Composer He Is Anirudh Ravichandar telugu movie news
Tollywood: అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న సౌత్ మ్యూజిక్ డైరెక్టర్.. అతడి పాటలన్ని సూపర్ హిట్స్.. ఎవరంటే..
ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్. ఒక్కో సినిమాకు ఏకంగా రూ.10 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడట. ఏఆర్ రెహమాన్, ఎంఎం కీరవాణి, దేవీ శ్రీ ప్రసాద్, తమన్ అనుకుంటే పొరపాటే. అతడు కూడా సౌత్ ఇండస్ట్రీకి చెందిన సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్. అతడు మరెవరో కాదండి..
Updated on: Jun 13, 2024 | 5:13 PM

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్. ఒక్కో సినిమాకు ఏకంగా రూ.10 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడట. ఏఆర్ రెహమాన్, ఎంఎం కీరవాణి, దేవీ శ్రీ ప్రసాద్, తమన్ అనుకుంటే పొరపాటే. అతడు కూడా సౌత్ ఇండస్ట్రీకి చెందిన సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్.

అతడు మరెవరో కాదండి.. అనిరుధ్ రవిచంద్రన్. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటివరకు అతడు కంపోజ్ చేసిన సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. 2023లో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాకు ఏకంగా రూ.10 కోట్లు వసూలు చేశాడట.

ప్రస్తుతం ఇండియన్ 2 వంటి భారీ బడ్జెట్ మూవీస్ కోసం రూ.8 నుంచి 10 కోట్ల వరుక వసూలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే దేవర సినిమాకు ఎక్కువే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అలాగే అనిరుధ్ కంపోజ్ చేసే పాటలకు ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉన్నారు.

ధనుష్ నటించిన 3 సినిమాతో సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇందులో వై దిస్ కొలవరి ఢీ పాట అప్పట్లో సెన్సెషన్ సృష్టించింది. అనిరుధ్ వయసు ప్రస్తుతం 33 సంవత్సరాలు. 1990లో అక్టోబర్ 16న మద్రాసులో జన్మించాడు.

అనిరుధ్ రవిచంద్ర.. సూపర్ స్టార్ రజినీకాంత్ వీరాభిమాని. ఇటీవల జైలర్




